Begin typing your search above and press return to search.

అఖిల్ సినిమాను అందుకే వద్దా??

By:  Tupaki Desk   |   5 July 2017 4:42 AM GMT
అఖిల్ సినిమాను అందుకే వద్దా??
X
అక్కినేని అఖిల్ నటిస్తున్న రెండో సినిమా ప్రారంభమై మూడు నెలలు దాటిపోయింది. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ లను కూడా పిక్చరైజ్ చేసేస్తున్నారు. యంగ్ హీరో నటిస్తున్న సినిమా అంటే.. ఈ పాటికి మూవీ షూటింగ్ రొమాంటిక్ మూడ్ లోకి కూడా వెళ్లిపోయి ఉండాలి. కానీ అఖిల్ సెకండ్ విషయంలో మాత్రం.. ఈ పాయింట్ ఇంకా ఆలస్యమవుతూనే ఉంది. ఇందుకు కారణం.. అసలు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరూ ఫిక్స్ కాకపోవడమే.

మొదటగా ఈ మూవీలో ఆలియాభట్ ను ఒప్పించేందుకు ప్రయత్నించారనే టాక్ వినిపించింది. అయితే ఈ ఆఫర్ కు ఆమె ఒప్పుకోలేదనే టాక్ వచ్చింది. నితిన్ తో కలిసి లై చిత్రంలో నటిస్తున్న మేఘా ఆకాష్ ను ప్రయత్నించారని అన్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త వాదన వినిపిస్తోంది. పలువురు హీరోయిన్స్ ఈ ఆఫర్ ను తిరస్కరించడానికి కారణం.. ఈ మూవీలో హీరోయిన్ కు స్క్రీన్ టైం ఎక్కువగా లేకపోవడమే అంటున్నారు. హీరో పాత్ర హీరోయిన్ ను వెతుక్కుంటూ సాగుతుందట. అంటే డ్రీమ్ సాంగ్స్ మినహాయిస్తే.. దాదాపుగా సినిమా చివరి వరకూ హీరోయిన్ డైరెక్టుగా కనిపించే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఇది యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల కథలా ఉన్నా.. టాక్ మాత్రం ఇదే వినిపిస్తోంది.

గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినా.. ఈ కథలకు ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడించి ఉంటుంది. అందుకే.. కొత్తమ్మాయి అయితే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట దర్శకుడు విక్రమ్ కె కుమార్. ప్రస్తుతం కొత్త భామను వెతికే పనిలో ఉన్నారు టీం.