Begin typing your search above and press return to search.

ఆలి.. ఎందుకు మిస్సయ్యాడో మరి!!

By:  Tupaki Desk   |   28 Jun 2016 4:13 AM GMT
ఆలి.. ఎందుకు మిస్సయ్యాడో మరి!!
X
కేవలం టివిలో కనిపించే ప్రీ-స్ర్కిప్టెడ్‌ వీడియో స్ఫూఫ్‌ లో తప్పిస్తే.. సిని'మా' అవార్డుల కార్యక్రమంలో కమెడియన్‌ ఆలి అస్సలు కనిపించలేదు. గడిచిన అనేక ఏళ్ళలో యాంకర్ సుమతో కలసి ఆలి చేసే యాంకరింగ్ చాలా ఫేమస్‌. పైగా మనోడు వేసే మసాలా జోకులు.. సెటైర్లు.. పంచులూ కూడా ఆడియన్స్ కు బాగా అలవాటైపోయాయ్‌. అలాంటప్పుడు 2016 అవార్డులకు ఆలిని ఎందుకు తీసుకోలేదు?

సాధారణంగా ఎవరికైనా తట్టే కారణం ఏంటంటే.. వివిధ సందర్భాలలో హీరోయిన్ల అందాల గురించి పబ్లిక్‌ గానే ఆలి కామెంట్లు చేసి 'సెక్సిస్టు కామెంట్లు' అంటూ వివాదాల్లో ఇరుక్కున్నాడు కాబట్టి.. ఈసారి అతగాడిని తప్పించారా అనే సందేహం వస్తుంది. ఒకవేళ అలా తప్పించారనే అనుకుంటే.. మరి అవార్డుల మధ్యలో వచ్చే వీడియో స్పూఫ్‌ లకు ఎందుకు తీసుకున్నట్లు? ఇదే విషయంపై సన్నిహితులు స్పందిస్తూ.. అసలే రంజాన్ పవిత్ర మాసం నడుస్తోంది కాబట్టి.. రోజుకు ఐదుసార్లు నమాజ్ చదివే ఆలి.. ఈ కార్యక్రమాన్ని హోస్టు చేయలేను అన్నాడని మరొక రీజన్ చెబుతున్నారు.

ఏదేమైనా కూడా.. ఆలి ఈ కార్యక్రమాన్ని మిస్సయిపోవడంతో.. చక్కగా హీరో సునీల్‌ ఆ అవకాశాన్ని తన్నుకుపోయాడు. పైగా ఈ మధ్యన ఇలాంటి అవార్డుల కార్యక్రమాలన్నీ ఓ మాదిరి హీరోలే నిర్వహిస్తున్నారు కాబట్టి.. సునీల్‌ అయితేనే కరక్టు అనుకున్నారేమోలే ఆర్జనైజర్లు.