Begin typing your search above and press return to search.

నారి నారి నడుమ జంటిల్ మేన్

By:  Tupaki Desk   |   8 Sep 2017 4:07 AM GMT
నారి నారి నడుమ జంటిల్ మేన్
X
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో సిద్ధార్ధ్ మల్హోత్రా - ఆలియా భట్ ఒకేసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఆలియా కు విపరీతమైన క్రేజ్ వచ్చి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయినా తన ఫస్ట్ హీరో సిద్ధార్ద్ తో రిలేషన్ షిప్ మాత్రం కంటిన్యూ చేసింది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో గట్టి ప్రచారమే జరిగింది.

ఏడాది కాలంగా సిద్ధార్ధ్ ఎ జంటిల్ మేన్ సినిమా షూటింగ్ చేస్తూ వచ్చాడు. ఈ సినిమా ఈ మధ్యే రిలీజియంది. యాక్షన్ బేస్ డ్ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. షూటింగ్ కోసం వీళ్లిద్దరూ చాలా రోజులు ఫారిన్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆన్ స్ర్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటయిందని యూనిట్ వర్గాల టాక్. ఈ విషయం తెలిసిన వెంటనే ఆలియాకు కోపమొచ్చి సిద్ధార్ద్ తో గొడవకు దిగిందట. బేసిగ్గా ఆలియా అండ్ సిద్ధార్ధ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటారు. కానీ కొంత కాలంగా వీళ్లిద్దరూ ట్విట్టర్ లో పలకరించుకోవడమే మానేశారు.

రీసెంట్ గా జాక్వెలైన్ బర్త్ డే సందర్భంగా ఆలియా ఆమెకు విషెస్ చెప్పింది. దానికి జాక్వెలైన్ బదులు కూడా ఇచ్చింది. వీళ్లిద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నా సిద్ధార్ద్ మాట మాత్రం ఎత్తడం లేదు. జాక్వెలైన్ మోహంలో పడి సిద్ధార్ద్ ఆలియా కు కటీఫ్ చెప్పేశాడనేది బాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. జంటిల్ మెన్ సినిమా ఇంతపని చేస్తుందని ఆలియాకు మాత్రం ఏం తెలుసు? పాపం... ప్చ్!