Begin typing your search above and press return to search.

ఈ కలక్షన్ల ప్రచారం వెనుక మర్మం ఏంటో!!

By:  Tupaki Desk   |   19 Jan 2017 10:14 AM GMT
ఈ కలక్షన్ల ప్రచారం వెనుక మర్మం ఏంటో!!
X
ఇప్పుడు అందరూ కూడా ఒక విషయం చూసి షాకైపోతున్నారు. సాధారణంగా అయితే మన నిర్మాతలు ఎవరూ కూడా ఇంత కలక్షన్ వచ్చింది అంతొచ్చింది అంటూ ప్రచారం చేయరు. ట్రేడ్ వర్గాలు ఇచ్చిన ఫిగర్లను అభిమానులు మాత్రం ప్రచారం చేస్తుంటారు. హీరోలు కూడా మాకు కలక్షన్లతో పెద్దగా సంబంధం లేదు అన్నట్లు చెబుతారు. కాని ఇక్కడ ఖైదీ నెం 150లో సీన్ రివర్స్ లో వెళుతోంది.

నిన్నే ప్రెస్ మీట్ పెట్టేసి 106 కోట్ల గ్రాస్ వచ్చిందంటూ అల్లు అరవింద్ ప్రకటించారు. ఖైదీ నెం 150 సినిమాలో ఈయన అఫీషియల్ గా పార్టనర్ కాకపోయినా కూడా.. మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్‌ తరుపున తెరవెనుక పన్నాగం అంతా నడిపించింది ఈయనే అనే విషయం తెలిసిందే. ఖైదీకి కావల్సినన్ని ధియేటర్లు సమకూర్చడం నుండి.. ప్రచార బాధ్యతలు చూసుకోవడం వరకు.. అన్నింటిలోనూ అరవింద ప్లానింగే కీలకం. అయితే ఈయన ఇలా కలక్షన్లను రివీల్ చేస్తుండటంతో.. అసలు ఈ టైపులో సినిమాకు సంబంధించిన బిజినెస్ అంతా బయట పెట్టేసి ఏం సాధిద్దామని అనే సందేహం రాక మానదు.

నిజానికి చూస్తుంటే.. చాలా రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ తగ్గిందనే అందరూ అనుకున్నారు. పొలిటికల్ లైఫ్‌ లో ఒడిదుడుకులు వలన.. ఆయన సినిమాలకు కూడా ఆదరణ తగ్గుద్దేమో అనే సందేహం ఉండేది. బహుశా ఈ కలక్షన్లను చూపించి.. విమర్శకులకు సమాధానం చెప్పాలని అల్లువారు వ్యూహం రచించారా? అయ్యుండొచ్చు. లేదంటే ఇన్నేసి కలక్షన్లు వస్తున్నాయని ప్రచారం చేస్తే.. అది చూసి ప్రేరణ పొంది ఇంకా సినిమా చూడాని వారు ధియేటర్లకు పరిగెడతారని కూడా ఆయన అనుకుని ఉండొచ్చు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/