Begin typing your search above and press return to search.
బన్నీకి బ్రేక్ పడింది అందుకేనా?
By: Tupaki Desk | 24 Oct 2018 5:33 AM GMTనా పేరు సూర్య విడుదలై ఆరు నెలలు అవుతోంది. మొన్నే శాటిలైట్ ఛానల్ లో కూడా వచ్చేసింది. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా మాత్రం ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు. అసలు ఏ దర్శకుడితో ఉంటుందా అనే సంశయం కొనసాగుతూనే ఉంది. విక్రమ్ కుమార్ తో ఆల్మోస్ట్ ఓకే అనుకునే దాకా వచ్చి ఏవో కారణాలతో మొత్తానికి దాన్ని పక్కన పెట్టేసారు. త్రివిక్రమ్ తో చేసే అవకాశాల గురించి అరవింద సమేత వీర రాఘవ విడుదల ముందు నుంచే చర్చ జరుగుతోంది. కానీ అది కార్యరూపం దాల్చడం అంత ఈజీగా కనిపించడం లేదు. కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా హారికా అండ్ హాసిని తోనే డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. కానీ వాటితో పాటు డివివి దానయ్య కు మైత్రి మూవీ మేకర్స్ కు విడివిడిగా ఇంతకుముందే మాట ఇచ్చాడట. సో ఎవరితో చేసినా ఈ మూడు బ్యానర్లను కాదని వేరే వాళ్ళతో చేసే వీలు పడదు. మరోవైపు బన్నీకి కూడా ఇలాంటి చిక్కే ఉంది. నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ తో కలిసి గీత ఆర్ట్స్ అసోసియేషన్ లో ఓ ప్రాజెక్ట్ కు బన్నీ మాట ఇచ్చాడట. కానీ త్రివిక్రమ్ తో ఓకే అనుకున్నా ఈ కాంబోలో సాధ్యపడదు. అలా అని తర్వాత చూద్దాం లెమ్మని చెప్పినా కొంత ఇబ్బందే.
త్రివిక్రమ్ వెంకటేష్ తో చేసే అవకాశాల గురించి గతంలోనే ప్రచారం జరిగింది. జాలీ ఎల్ ఎల్బి 2 హక్కులు కూడా కొన్నారని బలంగా వినిపించింది. కానీ త్రివిక్రమ్ మాత్రం కొత్త సబ్జెక్టు ఆలోచించే పనిలో ఉన్నాడట. సో చక్రవ్యూహంలా కనిపిస్తున్న ఈ కాంబోల వల నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాకే త్రివిక్రమ్ బన్నీల సినిమా గురించి ఏ ప్రకటనా వచ్చే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. ఏదైతేనేం ఫ్యాన్స్ మాత్రం ఇంకెంత లేట్ అంటూ ఎదురు చూస్తూనే ఉన్నారు. చెక్ పడాలి అంటే మరో నెల రోజుల దాకా టైం పట్టేలా ఉంది. చూద్దాం.