Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్ ఎందుకు స్పందించాడంటే..
By: Tupaki Desk | 13 Oct 2015 8:20 AM GMTపోయి పోయి దాసరితో పెట్టించాడు ప్రెస్ మీట్ గుణశేఖర్. అసలే పెద్దాయన మెగా ఫ్యామిలీ మీద సెటైర్ వేయడానికి ఎక్కడ సందు దొరుకుతుందా అని ఉంటాడు. అలాంటాయనకి ‘బ్రూస్ లీ’ మీద పడ్డానికి మంచి ఛాన్స్ దొరికింది. అంతే ‘రుద్రమదేవి’ కోసం ఆ సినిమాను వాయిదా వేయకపోవడంపై సెటైర్ వేసేశారు దాసరి. ‘రుద్రమదేవి’ కోసం అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి ఎంత సాయం చేశారో తెలియంది కాదు. దీంతో గుణశేఖర్ ఆత్మరక్షణలో పడిపోయాడు. వెంటనే గుణ వైపు నుంచి డ్యామేజ్ కంట్రోల్ జరిగినప్పటికీ.. ఇంకో పక్క అల్లు అర్జున్ ఇరుకున పడిపోయాడు. ‘రుద్రమదేవి’కి హీరో కాని హీరో బన్నీ. తన బావ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ మీదే సెటైర్ పడేసరికి స్పందించక తప్పలేదు.
ఐతే ఇలా స్పందించడానికి ముందు చాలా తతంగమే నడిచింది. దాసరి అనగానే మంటెత్తిపోయే అభిమానులు ట్విట్టర్లో, ఫేస్ బుక్కుల్లో ఆగ్రహం ఆపుకోలేకపోయారు. బన్నీ పేజీల్లోకి వెళ్లి.. దాసరి వ్యాఖ్యల్ని ఖండిచాలంటూ తీవ్ర ఒత్తడి తెచ్చారు. అంతకంతకూ డిమాండ్లు పెరిగిపోవడం.. మెగా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో.. బ్రూస్ లీ టీమ్ తప్పేమీ లేదంటూ బన్నీ స్పందించక తప్పలేదు. మెగా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే అది ‘రుద్రమదేవి’కి చేటుగా మారే ప్రమాదం కూడా ఉందని బన్నీ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి అందరినీ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఐతే ఇంతకుముందు సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ లోనూ దాసరి చిరు మీద వేసిన సెటైర్ కు బన్నీనే స్పందించి.. మెగా అభిమానుల్ని కూల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.