Begin typing your search above and press return to search.

రాలేనని చెప్పేందుకే వచ్చాడు బన్నీ

By:  Tupaki Desk   |   27 March 2016 1:30 PM GMT
రాలేనని చెప్పేందుకే వచ్చాడు బన్నీ
X
మార్చ్ 27న మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లడ్ డొనేషన్ కేంప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. చిరంజీవి అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా నూర్ అనే మెగా వీరాభిమాని కూడా భారీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అల్లు అర్జున్ ని ఆహ్వానించాడు నూర్.

అయితే.. మార్చ్ 28న చిరు చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి జరగనుంది. బెంగళూరులో జరగనున్న ఈ వివాహవేడుకకు.. రెండు రోజుల ముందే మొత్తం ఫ్యామిలీ అంతా తరలివెళ్లింది. అందుకే మెగాభిమాని నూర్ పిలిచిన కార్యక్రమానికి బన్నీ హాజరు కాలేనని బన్నీకి అర్ధమైంది. ఈ విషయాన్ని అభిమానికి ఓ ఫోన్ ద్వారా చెబితే సరిపోతుంది. కానీ అలా చేస్తే అల్లు అర్జున్ స్టైల్ ఎందుకవుతుంది.. అందుకే తనే నూర్ ఇంటికి వెళ్లిపోయి.. రెండు రోజుల ముందే బన్నీ బర్త్ డే సెలబ్రేట్ చేసేశాడు. అంతే కాదు.. తను రాలేకపోవడానికి కారణం చెబుతూ.. ఇప్పుడెందుకొచ్చాడో అల్లు అర్జున్ చెప్పిన రీజన్ అందరినీ ఆకట్టుకుంది.

'ఈయన నూర్ - చిరంజీవి గారి పెద్ద పెద్ద వీరాభిమాని, ఫ్యాన్స్ లో సీనియర్ మోస్ట్. రేపు పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ హోస్ట్ చేయబోతున్నారు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనికి నేను రావడానికి ప్లాన్ చేశాను, కానీ రాలేకపోతున్నాను. మా ఇంట్లో పెద్ద పెళ్లి ఉండడమే ఇందుకు కారణం. నేను రాలేకపోతున్నానని కాబట్టి పర్సనల్ గా వచ్చి రాలేకపోతున్నానని చెప్పడానికే ఇలా వచ్చాను. డెఫినెట్ గా ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ట్రై చేశాను.. కానీ కుదర్లేదు. ఇంతదూరం రావడం వల్ల.. ట్రై చేశానని అర్ధం అవుతుంది కదా.. అందుకే వచ్చా' అంటూ బన్నీ ఇచ్చిన సుదీర్ఘమైన ఎక్స్ ప్లనేషన్ ఫ్యాన్స్ ని హత్తుకుపోయింది.

చివరగా 'ఐ లైక్ టు విష్ చరణ్.. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.. ఫ్యామిలీ నుంచి నా నుంచి అండ్ మన మెగా ఫ్యాన్స్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అన్నాడు అల్లు అర్జున్.