Begin typing your search above and press return to search.
కథలు లేకనే తెలుగులో నటించట్లేదు
By: Tupaki Desk | 19 Aug 2017 7:33 AM GMTమైనా సినిమాతో సౌత్ ఇండస్ట్రికి పరిచయమైన అమలా పాల్ ఇప్పుడు మలయాళం - తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. అమలా తెలుగులో కూడా మంచి హిట్ ట్రాక్ ఉంది. కానీ ఎందుకో ఈ మధ్య తెలుగు తెర పై పూర్తిగా కనిపించటం మానేసింది. ‘నాయక్’ - ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ కేరళ అమ్మాయి ఇప్పుడు ఒక డబ్బింగ్ సినిమాతో రాబోతోంది. తమిళ్ హీరో ధనుష్ హీరోగా నటించిన విఐపి2 తమిళనాడులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో విడుదలవుతుంది. విఐపి2 లో ధనుష్ కు జంటగా అమలా పాల్ నటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ఇంటర్వ్యూ లో తెలుగు సినిమాలలో తక్కువగా నటించడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు అమలా పాల్ ఇలా చెప్పింది.
“నేనేం కావాలని తెలుగు సినిమాలు చేయడం తగ్గించలేదు. అసలు చెప్పాలి అంటే నాకు తెలుగులోనే మంచి కమర్షియల్ సక్సెస్ ఉంది. నాకు ఇక్కడ పని చేయడం చాలా ఇష్టం.. కాకపోతే ఇప్పుడు నేను తమిళ్ మలయాళం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇంకా నేను ఇప్పుడు కథలను ఎంచుకునే విధానం కూడా మార్చుకున్నాను. కథ బలంగా ఉంటేనే చేస్తున్నాను. కొత్త ఆలోచనలు కొత్త డైరెక్టర్లతో చేయాలని భావిస్తున్నాను. నటనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండే పాత్రలను చేయాలని అనుకుంటున్నాను. మంచి కథలు ఉంటే ఏ ఇండస్ట్రిలోనైనా పని చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను” అని చెప్పింది.
బాలీవుడ్ హిట్ సినిమా క్వీన్ మలయాళం రీమేక్ లో అమలా పాల్ నటించబోతోందని తెలుస్తోంది. అలానే మరో రెండు తమిళ్ సినిమాలలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ''కమర్షియల్ సినిమాలు అప్పుడుప్పుడూ చేస్తూ కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. అలా అని కమర్షియల్ సినిమాలు చేయను అని కాదు రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను'' అని ముగించింది డస్కీ బ్యూటి అమలా పాల్!!