Begin typing your search above and press return to search.

ఆమె వల్ల ఆఫర్ మిస్ అయిన హీరొయిన్!

By:  Tupaki Desk   |   27 Jun 2019 6:13 AM GMT
ఆమె వల్ల ఆఫర్ మిస్ అయిన హీరొయిన్!
X
ఇటీవలే విడుదలైన ఆమె (తమిళ్ అడై)టీజర్ ఎంత సంచలనం అయ్యిందో చూసారుగా. హీరొయిన్ అమల పాల్ దాదాపు నగ్నంగా నటించడం చూసి అందరూ షాక్ తిన్నారు. ఒక పేరున్న కథానాయకి ఇలా చేయడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఈ వీడియో వచ్చాకే సినిమా బిజినెస్ అమాంతం పెరిగిపోయింది. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ హక్కులు కొన్నారంటేనే దీని మీద హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాని ఇదే తనకు మరో సినిమా ఛాన్స్ పోగొట్టిందని చెబుతోంది అమలా పాల్. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న అతని 33వ చిత్రం నుంచి అమలా పాల్ తప్పుకుంది. తన మాటల్లో చెప్పాలంటే నిర్మాతలే స్వయంగా తప్పించారు. ఇందాకా ఇన్ స్టాగ్రామ్ లో దీని గురించి చెప్పిన అమల పాల్ సదరు సంస్థ ద్వంద్వ వైఖరి పట్ల ఘాటుగా విమర్శించింది

తాను ఏనాడూ నిర్మాతలు ఇబ్బందిపడే తరహాలో ఖర్చుల కోసం వేదించలేదని ఇప్పుడు చేస్తున్న ఈ విఎస్ పి 33 కోసం కూడా ముంబైలో స్వంత వ్యయం మీద షాపింగ్ చేస్తున్న తనకు చందర ఆర్ట్స్ అధినేతలలో ఒకరైన రత్నవేలు కుమార్ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పింది. అందులో ఊటీలో షూటింగ్ చేయాల్సిన సందర్భంగా తాను అడిగిన డిమాండ్స్ సబబుగా లేనందు వల్ల ఇక సేవలు అవసరం లేదని అందులో ఉందట.

ఇది కేవలం ఆమె టీజర్ వచ్చాక పుట్టిన పుకార్లు తన మీద జరుగుతున్న ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అయినా తానేమి వీటిని లెక్కచేయనని ఇకపై ఆ ప్రాజెక్ట్ లో లేనని ప్రకటించేసింది. మొత్తానికి ఆమె సంచలనంతో పాటు ఇలాంటి ట్విస్టులు కూడా ఇస్తోందన్న మాట. రామ్ చరణ్ నాయక్ హీరొయిన్ మనకూ పరిచయమున్న అమలా పాల్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడీ సెన్సేషనల్ ఆమె సినిమాతో రానుండటం అంచనాలు రేపుతోంది