Begin typing your search above and press return to search.

నిరోష ఆత్మహత్యకు అసలు కారణం

By:  Tupaki Desk   |   17 March 2016 9:46 AM GMT
నిరోష ఆత్మహత్యకు అసలు కారణం
X
టీవీ యాంకర్ నిరోష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిజానికి ఈ సూసైడ్ కు లవ్ ఫెయిల్యూర్ లాంటిదేదైనా రీజన్ కావచ్చనే అనమానాలు వినిపించాయి. రిత్విక్ అనే కెనడాలో నివసించే కుర్రాడితో వీడియా కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, కాల్ డిస్కనెక్ట్ చేసేసింది. ఇతనితో కాల్ మాట్లాడే సమయంలో గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు.

తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం.. నిరోష ఆరోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిరోష తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోందని.. నిరోష పేరెంట్స్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇలా హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఓ తెలుగు మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ఈమె.. సికింద్రాబాద్ లోని ప్రైవేటు హాస్టల్ లో నివసిస్తూ.. అక్కడే ఉరి వేసుకుంది.

రిత్విక్ తో వివాదానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజానికి నిరోషకు గత నెలలోనే ఎంగేజ్ మెంట్ కాగా.. త్వరలో పెళ్లి కావాల్సి ఉంది. ప్రవర్తన పరంగాను, వ్యక్తిగతంగాను ఎంతో మంచి నడవడిక ఉన్న అమ్మాయిగా నిరోషకు మంచి గుర్తింపు ఉంది.