Begin typing your search above and press return to search.
ఆ పాట టీజర్ చూసి బోయపాటి ఛాన్సిచ్చాడు
By: Tupaki Desk | 17 Jan 2016 4:39 AM GMTఅల్లు అర్జున్ తో అంజలి ఐటెం సాంగ్.. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో దీని గురించి బాగానే చర్చ నడుస్తోంది. అంజలి లాంటి ఫ్యామిలీ హీరోయిన్ తో అల్లు అర్జున్ స్టెప్పులేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొదట ఇది రూమర్ అయి ఉండొచ్చని కొట్టి పారేశారు. కానీ తర్వాత స్వయంగా అంజలియే ఈ పాట గురించి కన్ఫమ్ చేసింది. మరి ఆమెకు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? బోయపాటి ఎందుకు అంజలికే అవకాశమిచ్చాడు అంటే..
‘‘అల్లు అర్జున్ తో సాంగ్ చేసే అవకాశం రావడానికి కారణం శంకరాభరణం సినిమానే. అందులో ‘ఘంటా..’ అనే పాట ఉంటుంది. అందులో నేను వీర లెవెల్లో స్టెప్పులేశారు. తొలిసారి మాస్ అప్పీల్ తో కనిపించా. ఆ పాటను టీజర్లో చూసి తన సినిమాలో ఓ సాంగ్ చేయమని బోయపాటి శ్రీను అడిగారు. ఇది ఐటెం సాంగ్ కాదు.. స్పెషల్ సాంగ్. ‘ఘంటా...’ పాట కంపోజ్ చేసిన శేఖర్ మాస్టరే ఆ పాటా చేస్తున్నారు. అల్లు అర్జున్ పక్కన డ్యాన్సుల్లో నాకూ సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే, ఒప్పుకున్నా. సినిమా చూశాక మీకూ అర్థమవుతుంది’’ అని అంజలి చెప్పింది.
ఇలాంటి పాటల కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా అని అడిగితే.. ‘‘అలాంటిదేమీ లేదు. అయినా హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి ఎందుకంతా ఇదైపోతారు. డిమాండ్ ఉన్నపుడే ఎవరైనా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. మార్కెట్ లో దేనికైనా సేల్స్ బాగా ఉన్నప్పుడే ధర పెంచుతారు. హీరోయిన్ మార్కెట్ తగ్గిపోయాక ఎవరైనా కోరుకున్న పారితోషకం ఇస్తారా’’ అని గడుసుగా ప్రశ్నించింది అంజలి.