Begin typing your search above and press return to search.
స్వీటీ దెబ్బకి ఆ డైరెక్టర్ కి షాక్
By: Tupaki Desk | 20 Jun 2016 5:50 AM GMTట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం అవకాశం దక్కించుకోవడం ద్వారా.. తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణిని హ్యాండిల్ చేస్తున్నాడు. బాలయ్య సరసన ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలన్నది ఈ దర్శకుడి మొదటి ఆలోచన. ఇప్పుడా రోల్ ని శ్రియ చేస్తున్నా.. అనుష్కను తీసుకోలేకపోవడంపై క్రిష్ అప్ సెట్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.
క్రిష్-అనుష్కలు ఇద్దరూ కలిసి ఇప్పటివరకూ చేసిన సినిమా వేదం ఒక్కటే. అయినా సరే వీరి మధ్య మంచి రిలేషన్ ఉంది. పైగా ఈ మధ్య హిస్టారికల్ చిత్రాలతో స్వీటీ కుమ్మేస్తోంది. అందుకే గౌతమిపుత్ర శాతకర్ణిలో.. అనుష్క అయితే కరెక్ట్ ఆప్షన్ అన్నది క్రిష్ ఆలోచన. గతంలో మాదిరిగా విపరీతంగా కూడా సినిమాలు చేయడం లేదీ భామ. సెలెక్టివ్ ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అలాగని డేట్స్ ఎడ్జస్ట్ చేయలేనంత బిజీగా కూడా ఏం లేదు.
అయినా సరే బాలయ్య సినిమాని తిరస్కరించడం ఆలోచించాల్సిన విషయం. గతంలో ఒక్క మగాడు చిత్రంలో బాలకృష్ణతో స్వీటీ నటించింది. ఇప్పుడు మాత్రం రిజెక్ట్ చేసింది. దీని వెనక ఓ స్టార్ హీరో ఉన్నాడన్నది టాలీవుడ్ వెర్షన్. ఇప్పుడు హథీరాం బాబాగా నాగ్ చేస్తున్న మూవీలో నటించేందుకు ఒప్పుకున్న అనుష్క.. బాలకృష్ణ చిత్రాన్ని తిరస్కరించడం వెనక రీజన్ ఏంటనేది మాత్రం అందరికీ సస్పెన్స్ గానే ఉంది.