Begin typing your search above and press return to search.
బాహుబలికి ఇంకా షాకులు తగలొచ్చు
By: Tupaki Desk | 9 May 2016 10:30 PM GMTబాహుబలి: ది బిగినింగ్.. ఇప్పటికే 600 కోట్లు గ్రాస్ వసూలు చేసిన సినిమా. అందుకే ఈ సినిమాను దేశ విదేశాల నుండి వచ్చి విపరీతంగా డబ్బులు పోసి కొనుక్కున్నారు. అయితే మొన్నమధ్యన జర్మనీలో రిలీజై సినిమా ఫ్లాపైన సంగతి తెలిసిందే. అక్కడ కలక్షన్ అంతా ఎంట్రీ లెవెల్ లక్షల్లోనే ఉంది. దానికి కారణం ఏంటంటారు? ఇన్నేసి కోట్లు వసూలు చేసిన సినిమా అక్కడెందుకు కనెక్ట్ కాలేదు?
మ్యాటర్ ఏంటంటే.. బాహుబలి సినిమాలో కథ పాళ్లు చాలా తక్కువ. కాకపోతే మనం ఎప్పుడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ కంటితో సినిమాను కొత్తగా చూడటం వలన.. కలక్షన్ల దార కురిసింది. అయితే అక్కడ మాత్రం.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి టివి సీరియల్స్ లోనే బాహుబలికి బాబులాంటి ఎఫెక్టులు ఎన్నో చేస్తున్నారు. బాహుబలి సినిమాలో ఒక దున్నపోతుతో ఫైట్ చేసే ఎపిసోడ్ చూస్తే.. అది ఖచ్చితంగా గ్రాఫిక్స్ అని చాలా చోట్ల తెలుస్తుంది. కాని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక రాణి ఏకంగా ఒక డ్రాగన్ నే పెంచుకుంటుంది. ఎక్కడా కూడా అది మనకు డూప్లికేట్ అని అనిపించదు. అంత రియలిస్టిక్ లుక్ ఉంటుంది. అందుకే అక్కడ ఆడియన్స్ కు బాహుబలి కిక్ ఇవ్వలేదు.
అంతే కాదు.. బాహుబలిలో కథ ఫ్యాక్టర్ కూడా గట్టిగా లేదు కాబట్టి.. కేవలం సెకండాఫ్ అంతా యుద్ద విన్యాసాలు చూడటం కోసం వారు అక్కడ పెద్దగా ఆసక్తి చూపలేదు. పైగా యుద్దం అంతా ఫ్లాట్ ఫార్మాట్ లో సాగుతుంది. ట్రాయ్ సినిమా రేంజులో కూడా ఎపిసోడ్లు లేవుగా. జర్మనీలోనే కాదు.. ఇతర యురోపియన్ దేశాల్లో కూడా ఇలాంటి రిజల్టే రావొచ్చు మరి. కాకపోతే చైనా, కొరియాల్లో ఆడే ఛాన్సుంది.