Begin typing your search above and press return to search.

బాహుబలి నటులు అలా మిస్ అయ్యారు

By:  Tupaki Desk   |   19 Jun 2016 5:17 AM GMT
బాహుబలి నటులు అలా మిస్ అయ్యారు
X
గతేడాదికి సంబంధించి ఏ సినిమా అవార్డు ఫంక్షన్ అయినా.. బాహుబలి అండ్ టీమ్ ఆధిపత్యం కనిపిస్తోంది. అన్ని కేటగిరీల్లో కలిపి కనీసం ఓ డజన్ అవార్డులన్నా ఇంటికి తీసుకెళ్లిపోవడం జక్కన్న అండ్ కోకి అలవాటయిపోయింది. ఇప్పటివరకూ ఈ లెక్కే నడిచినా.. ఫిలింఫేర్ అవార్డుల్లో మాత్రం తొలిసారిగా ఈ సీన్ లో మార్పు వచ్చింది.

బెస్ట్ యాక్టర్ గా శ్రీమంతుడు గాను మహేష్ బాబు ఎంపికవడంతో.. బాహుబలి ప్రభాస్ దూరమయ్యాడు. బెస్ట్ యాక్టర్ -ఫిమేల్ కేటగిరిలో అనుష్కకు అవార్డ్ వచ్చినా.. అది రుద్రమదేవికి గాను వచ్చింది. సపోర్టింగ్ రోల్ అవార్డ్ విషయంలో కూడ సత్యరాజ్ - రాణాలు ఫిలింఫిర్ మిస్ అయ్యారు. కేవలం రమ్యకృష్ణకు మాత్రమే ఉత్తమ సహాయనటి అవార్డు గెలుచుకోగలిగింది. బెస్ట్ మూవీ - డైరెక్టర్ లాంటి పలు అవార్డులు బాహుబలికి దక్కినా.. నటుల విషయంలో మాత్రం బాహుబలికి ఒకే ఒక్క అవార్డు మాత్రమే రావడాన్ని గుర్తుంచుకోవాలి.

బాహుబలి డామినేషన్ ప్రభావం తగ్గుతోందని చెప్పేందుకు.. ఈ ఫిలింఫేర్ అవార్డులను ప్రామాణికంగా తీసుకోవచ్చు. అయితే సీక్వెల్ వచ్చే ఏడాది రానుండడంతో అప్పుడు మాత్రం బాహుబలి బాగానే డామినేషన్ చూపించే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే.. వీటితో సరిపెట్టుకోవాల్సిందే.