Begin typing your search above and press return to search.

అఖిల్ ని చూసి బాలయ్య డిసైడయ్యారా?

By:  Tupaki Desk   |   3 May 2016 4:56 AM GMT
అఖిల్ ని చూసి బాలయ్య డిసైడయ్యారా?
X
నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఖాయమైంది. బాలయ్య వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణితో.. ఆయన కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అయితే, మోక్షజ్ఞ నటుడిగా కాకుండా.. దర్శకుడికి అసెస్టింట్ గా మాత్రమే వర్క్ చేయనుండడం విశేషమే. నిజానికి ఇలాంటి ట్రెండ్ బాలీవుడ్ లో ఉంటుంది. అక్కడ ప్రస్తుతం టాప్ హీరోల స్టేటస్ అనుభవిస్తున్న రణబీర్ కపూర్ లాంటి వారసులంతా.. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినవారే.

ముందు సినిమాపై పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఆ తర్వాత ఒక్కో విభాగంపై పట్టు సాధించడం, చివరకు హీరోగా అరంగేట్రం చేయడం.. ఇదీ బాలీవుడ్ స్టైల్. ఇప్పుడు బాలయ్య కుమారుడిని కూడా ఇదే తరహాలో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. బాలయ్య ఇలా డిసైడ్ అవడానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు సన్నిహితులు. స్టార్ హీరోల వారసులుగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యి, నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వాళ్లను చూస్తూనే ఉన్నాం.

నందమూరి వంశంలో తారకరత్న - అక్కినేని వంశంలో అఖిల్ లు.. ఎంతో క్రేజ్ మధ్య ఇంట్రడక్షన్ జరిగినా.. అనుభవ లేమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమస్య తన కుమారుడి విషయంలో రాకుండా జాగ్రత్త పడుతున్నారట బాలయ్య. అరంగేట్రం నాటికే అన్ని విషయాల్లోనూ కొడుకును తీర్చిదిద్దాలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. మొత్తం మీద వారసుల విషయంలో బాలయ్య ఇప్పుడో ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారని చెప్పాలి.