Begin typing your search above and press return to search.
బాలయ్య యాడ్స్ చేయడు.. ఎందుకంటే
By: Tupaki Desk | 5 Jun 2016 9:35 AM GMTనేను ఇంత పెద్ద హీరో.. యాడ్స్ చేయడమేంటి అన్నట్లు ఇంతకుముందు మన హీరోలు కమర్షియల్స్ జోలికే వెళ్లేవాళ్లు కాదు. కానీ సినిమాలతో సమానంగా.. ఇంకా కుదిరితే సినిమాల్లో కంటే ఎక్కువ యాడ్స్ ద్వారా సంపాదించవచ్చని అర్థమయ్యాక ఒక్కొక్కరుగా ఆ బాట పట్టారు. మహేష్ బాబు యాడ్స్ ద్వారా భారీగానే జేబులో వేసుకుంటున్నాడు. ఇంకా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రవితేజ వీళ్లందరూ కూడా కమర్షియల్స్ చేస్తున్నవాళ్లే.
చిరంజీవి కూడా గతంలో థమ్సప్ యాడ్లో కనిపించాడు. పవన్ కూడా ఓసారి టచ్ చేసి.. తర్వాత ప్రకటనలు చేయకూడదని నియమం పెట్టుకుని తప్పుకున్నాడు. ఐతే నందమూరి బాలకృష్ణ మాత్రం ఎన్నడూ యాడ్స్ చేసింది లేదు. ఆయనకు భవిష్యత్తులో కూడా అవి చేయాలన్న ఉద్దేశం లేదు. సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ ను వేరే విషయాలకు వాడకూడదన్న ఉద్దేశంతోనే తాను ఇలా ప్రకటనలకు దూరంగా ఉంటున్నానని.. ఈ విషయంలో తనకు తన తండ్రే స్ఫూర్తి అని బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
తన తండ్రిని తమ ఆస్తిగా భావించిన కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆయన ఫొటోలు వేసుకున్నారు తప్ప ఆయనగా ఎన్నడూ యాడ్స్ చేయలేదని.. తన ఇమేజ్ ను అడ్డు పెట్టుకుని ప్రకటనల్లో చేయకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారని.. ప్రేక్షకుల వల్ల వచ్చిన ఈ ఇమేజ్ ను వారికి ఆనందాన్నిచ్చే సినిమాలు చేయడానికే ఉపయోగించుకోవాలన్నది ఆయన అభిప్రాయమని.. దాన్నే తాను కూడా పాటిస్తున్నానని బాలయ్య చెప్పాడు. ఐతే ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలేవైనా చేయడానికి తాను సిద్ధమని.. అంతే తప్ప డబ్బు కోసం నటించే ప్రసక్తే లేదని.. తనకు ఉన్నది చాలని బాలయ్య అన్నాడు.