Begin typing your search above and press return to search.

చివ‌రి చూపుకు బాల‌య్య డుమ్మా ఏలనో?

By:  Tupaki Desk   |   2 March 2018 7:38 AM GMT
చివ‌రి చూపుకు బాల‌య్య డుమ్మా ఏలనో?
X
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాలుగు స్థంభాల్లాంటి వారు చిరంజీవి... నాగార్జున‌... వెంక‌టేష్‌... బాల‌య్య‌. వీరిలో శ్రీదేవి బాల‌య్య త‌ప్ప‌... మిగ‌తా హీరోలంద‌రితో క‌లిసి న‌టించింది. బాల‌కృష్ణ‌తో మాత్రం ఒక్క సినిమా చేయ‌లేదు. ఇప్పుడు శ్రీదేవి అంత్య‌క్రియ‌ల‌కు కూడా బాల‌య్య వెళ్ల‌లేదు. ఎందుకు?

సీనియ‌ర్ ఎన్టీఆర్‌ తో సూప‌ర్ హిట్ సినిమాలు చేసింది శ్రీదేవి. ప‌ద‌హారేళ్ల‌కే అత‌ని ప‌క్క‌న నాయిక ఛాన్సు కొట్టేసింది. వారిద్ద‌రి పెయిర్ టాలీవుడ్‌ లో హిట్ట‌యింది. ఎన్టీఆర్ శ‌కం ముగిశాక‌... త‌రువాత త‌రం హీరోలు నాగార్జున‌... వెంకీ... చిరుల‌తో కూడా ఆడిపాడింది శ్రీదేవి. కానీ బాల‌య్య మాత్రం ఆమెతో క‌లిసి న‌టించ‌లేదు. దానికి కార‌ణం...బాల‌కృష్ణే. అత‌నితో న‌టించేందుకు శ్రీదేవి సిద్ధంగా ఉన్నా... బాల‌య్య మాత్రం ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. త‌న తండ్రితో క‌లిసి న‌టించిన్ హీరోయిన్ల‌తో తాను క‌లిసి న‌టించ‌న‌ని తెగేసి చెప్పాడ‌ట‌. దీంతో శ్రీదేవితో చేసే ఛాన్సును ఆయ‌నే వ‌దులుకున్నారు. ఏఎన్నార్‌ తో శ్రీదేవి క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ అలాంటి సెంటిమెంట్లేమీ పెట్టుకోకుండా నాగార్జున ఆమెతో క‌లిసి న‌టించాడు.

ఇప్పుడు శ్రీదేవి అస్త‌మించింది. తారాలోకం మొత్తం ఆమె అంత్య‌క్రియ‌ల‌కు ముంబై త‌ర‌లివెళ్లింది. నాగ్‌... వెంకీ... మెగాస్టార్ చిరు లాంటి టాలీవుడ్ హీరోలు కూడా త‌ర‌లి వెళ్లారు. కానీ బాల‌య్య వెళ్లలేదు. ఇంత‌కుముందు రామానాయుడు చ‌నిపోయిన‌ప్పుడు... అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌ర‌ణించిన‌ప్పుడు కూడా అంత్య‌క్రియ‌ల‌కు బాల‌య్య హాజ‌ర‌వ్వ‌లేదు. దానికి కార‌ణం కూడా అత‌ని సెంటిమెంటేన‌ట‌. ఎవ‌రి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్ల‌న‌నే నియ‌మాన్ని పెట్టుకున్నాడ‌ట‌. అందుకే శ్రీదేవి అంత్య‌క్రియ‌ల‌కు కూడా వెళ్లలేదు.

కాక‌పోతే నంద‌మూరి వంశం నుంచి ఎవ‌రో ఒక‌రు శ్రీదేవి చివ‌రి చూపుకు వెళితే బాగుండేది... కానీ ఎవ్వ‌రూ వెళ్లలేదు. త‌న తాత పేరు పెట్టుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ అయినా వెళితే బాగుండేది. ఎవ‌రూ వెళ్ల‌క‌పోవ‌డం కాస్త బాధాక‌ర‌మైన విష‌య‌మే.