Begin typing your search above and press return to search.

200 కోట్ల పోస్టర్ అందుకే పడలేదా?

By:  Tupaki Desk   |   7 May 2018 12:43 PM IST
200 కోట్ల పోస్టర్ అందుకే పడలేదా?
X
టాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ పోస్టర్లు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. భరత్ అనే నేను.. నా పేరు సూర్య చిత్రాల విషయంలో.. నిర్మాతలు వేస్తున్న గ్రాస్ కలెక్షన్ పోస్టర్స్ నమ్మశక్యంగా లేవని.. వాస్తవదూరంగా ఉన్నాయని ట్రేడ్ జనాలు చెబుతున్నారు. రామ్ చరణ్ మూవీ రంగస్థలం.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు.. టాలీవుడ్ కి నాన్ బాహుబలి బిగ్గెస్ట్ హిట్ కూడా.

కానీ ఈ సినిమా వసూళ్లను తలదన్నేలా భరత్ అనే నేను వసూళ్లపై పోస్టర్స్ వేస్తున్నారు. భరత్ అనే నేను చిత్రం 190.63 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు.. రీసెంట్ గా పోస్టర్ వచ్చింది. మొదటివారం ముగిసేసరికే 160కోట్లకు పైగా పోస్టర్ వేసి.. ఈ సారి 190 దగ్గర ఎందుకు ఆగిపోయారో.. 200 అని ఎందుకు వేయలేదో అనుకుంటున్నారు జనాలు. కానీ దీని వెనుక రామ్ చరణ్ నిలదీయడమే కారణంగా ఉందట. భరత్ అనే నేను నిర్మాత డీవీవీ దానయ్య.. రామ్ చరణ్ మరుసటి రెండు చిత్రాలకు నిర్మాత. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు మాత్రమే కాదు.. రాజమౌళితో ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రాన్ని కూడా ఈ నిర్మాతే తీయనున్నాడు.

రంగస్థలం సక్సెస్ ను తక్కువ చేసి చూపించే ప్రయత్నాన్ని చేస్తుండడాన్ని చరణ్ దృష్టికి తీసుకెళ్లారట కొందరు ఫ్యాన్స్ సంఘాలవారు. రంగస్థలం ఇంకా షేర్ పై నడుస్తున్నా సరే.. ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ప్రస్తావించారట. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని.. ఫేక్ పోస్టర్లపై గట్టిగానే ఆరా తీశాడట చరణ్. అందుకే భరత్ అనే నేను చిత్రానికి 200 కోట్ల పోస్టర్ ను కాకుండా 190 కోట్ల పోస్టర్ నే వేసినట్లు టాక్ వినిపిస్తోంది.