Begin typing your search above and press return to search.
యేలేటి చేతకాదని చెప్పేశాడు..
By: Tupaki Desk | 20 July 2016 9:30 AM GMTతెలుగులో ఉన్న విలక్షణమైన దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. ఇప్పుడందరూ కొత్తదనం కొత్తదనం అని.. తెలుగు సినిమా చాలా మారిపోయిందని అంటున్నారు కానీ.. పుష్కరం కిందటే ‘ఐతే’ సినిమాతో కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ లాగా నిలిచాడు యేలేటి. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించాలని తపించే యేలేటి.. దర్శకుడిగా అరంగేట్రం చేసి 13 ఏళ్లవుతున్నా ఐదు సినిమాలే తీశాడు. ఇప్పటిదాకా స్టార్ హీరోలెవ్వరితో పని చేయలేదు. ఐతే హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాయడం చేతకాకపోవడం.. కమర్షియల్ కథలు రాసే సామర్థ్యం లేకపోవడం వల్లే తాను వాళ్లతో సినిమాలు చేయలేకపోయానేమో అంటున్నాడు యేలేటి.
‘‘హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాయడం తప్పేమీ కాదు. నన్ను కూడా కొందరు హీరోలు మంచి కథలు ఉంటే సినిమా చేద్దామని అప్రోచ్ అయ్యారు. కానీ నేను వాళ్లను దృష్టిలో ఉంచుకుని కథలు రాయలేకపోయాను. ఫార్ములా ప్రకారం కమర్షియల్ సినిమాలు చేయడం నాకు చేతకాదని అనుకుంటా. వెంకటేష్ గారితో ఓ సినిమా చేయాల్సింది. ఆయనతో కలిసి ఏడాదిన్నర ట్రావెల్ చేశాను. అయినా సినిమా కుదర్లేదు’’ అని యేలేటి చెప్పాడు. తాను ఒక్కో సినిమాకు ఎక్కువ సమయమే తీసుకుంటానని.. పైగా తాను రెండు కథల మీద పని చేసి మూడేళ్లు వృథా చేసుకున్నానని.. ఆ రెండు సినిమాలు సెట్స్ మీదికి వెళ్లకపోవడం వల్ల తన కెరీర్లో ఎక్కువ గ్యాప్ వచ్చినట్లుగా అనిపిస్తుందని యేలేటి చెప్పాడు. ఈ విలక్షణ దర్శకుడి కొత్త సినిమా ‘మనమంతా’ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.