Begin typing your search above and press return to search.

ఛార్మీకి మూర్తి గారు గుర్తొచ్చారు..

By:  Tupaki Desk   |   27 Jan 2016 4:57 PM IST
ఛార్మీకి మూర్తి గారు గుర్తొచ్చారు..
X
అవార్డుల ఫంక్షన్ లో హీరోయిన్ ఛార్మీ ఎందుకు ఏడ్చింది? అందరూ సంతోషంగా ఉన్న సమయంలో వెక్కివెక్కి ఏడవాల్సిన అవసరం ఆ భామకి ఏంటి? అసలేం జరిగింది? ఐఫా అవార్డుల ఫంక్షన్ ముగిసిన తర్వాత.. ఛార్మీ ఏడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పక్కనే కూర్చున్న శ్రియ ఓదారుస్తూ కనిపించింది. ఈ ఇద్దరూ ఇలా మూడవుట్ అవడానికి కారణం ఇప్పుడు తెలిసింది.

అవార్డుల వేడుకలో... స్టేజ్ పై ప్రదర్శన ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. గత నెలలో స్వర్గస్తులైన తన తండ్రికి నివాళిగా పాడాడు. నాన్నకు ప్రేమతో చిత్రం కోసం అదే లైన్ తో సాగే తనే స్వయంగా రాసిన పాడుతూ పెర్ఫామ్ చేశాడు దేవిశ్రీ. ఈ సమయంలోనే ఛార్మీ ఇలా ఏడ్చేసింది. దీనికి కారణం.. దేవిశ్రీ తండ్రి సత్యమూర్తికి, ఛార్మీకి అనుబంధం ఉండడమే. దేవిశ్రీ కుటుంబానికి ఛార్మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అనేంతటి పరిచయం ఉంది. రైటర్ సత్యమూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో.. ఛార్మీకి సినిమాలకు మించిన సాన్నిహిత్యమే ఉంది.

సత్యమూర్తి మరణం సంగతి తెలిసిన తర్వాత.. మొదట చెన్నైకి వెళ్లిపోయిన వ్యక్తి కూడా ఛార్మీనే. ఇలా ఆ పెద్దాయన గుర్తుకు రావడం, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతోనే ఛార్మీ కంటతడి పెట్టాల్సి వచ్చింది. ఏడుపు నియంత్రించుకుందామని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో పక్కనే ఉన్న శ్రియ ఓదార్చాల్సి వచ్చింది.