Begin typing your search above and press return to search.
బ్రూస్‌లీని సేవ్ చేయడానికే చిరు ఎంట్రీ
By: Tupaki Desk | 17 Oct 2015 9:30 AM GMTస్టార్ హీరో కామియో అప్పియరెన్స్ అంటే ఆల్వేస్ క్రేజీ. ఎవరైనా సూపర్ స్టార్ ఓ ఐదు నిమిషాల పాటు అలా క్లయిమాక్స్ లో కనిపించి చిలౌట్ చేస్తే అది అభిమానుల్లో హుషారు పెంచుతుంది. సినిమా ఎలా ఉన్నా కలెక్షన్ లు కూడా పెరుగుతాయి. అందుకే మన దర్శకనిర్మాతలు తెలివైన ప్లానింగ్ తో కామియోలపై దృష్టి సారిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో మెగాస్టార్ కామియో లో నటిస్తున్నారు అనగానే అటు మెగాభిమానుల్లో, ఇటు కామన్ జనాల్లో ఎగ్జయిట్ మెంట్ పెరిగింది.
చాలా గ్యాప్ తర్వాత మెగాస్టర్ రీఎంట్రీ ఇది. అందుకే అందరూ బ్రూస్ లీ చిత్రంపై విపరీతంగా చర్చించుకున్నారు. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన బ్రూస్ లీ చిత్రం నిన్నటిరోజున రిలీజైంది. ఈ సినిమాకి జనాల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై చూసుకున్న ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఎగ్జయిట్ అయిపోయారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేసినందుకు ఆ ఫలితం తెరపై కనిపించింది. మెగా ఎంట్రీ బ్రూస్ లీకి పెద్ద ప్లస్ అయ్యింది. అయితే ఉన్నట్టుండి మెగాస్టార్ చిరంజీవిని శ్రీనువైట్ల ఇలా తెరపైకి తీసుకురావడం వెనక అసలు ఫార్ములా అందరికీ అర్థమైంది.
అసలే రొటీన్ కథతో రొటీన్ గా ఉన్న సినిమాలోకి చిరు ఎంట్రీ ఇచ్చేసరికి కాస్త కంటెంట్ పరంగా కిక్కు పెరిగింది. ఒకటి బ్రూస్ లీని ఎత్తడానికి చిరు ఎంట్రీ ఇచ్చారు. అలాగే 150వ సినిమాపై ఉన్న అనవసర హైప్ ని తగ్గించడానికి టీజర్ లా చిరు ఎంట్రీని ఉపయోగించుకున్నారన్నమాట!