Begin typing your search above and press return to search.

చిరంజీవి ఎమోషన్ కు కారణం?

By:  Tupaki Desk   |   21 March 2016 11:09 AM IST
చిరంజీవి ఎమోషన్ కు కారణం?
X
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి, చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. చాలా సుదీర్ఘంగా, ఓపికగా సాగిన చిరంజీవి ప్రసంగం లో పట్టరాని సంతోషం, ఆవేదన, తాను కోల్పోయింది మళ్ళీ దక్కింది అనే సంతృప్తి ఉంది. చిరంజీవి ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటే, తాను పవన్ ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం అవుతుంది. ఇప్పటివరకు చిరంజీవి ఎన్నో స్పీచ్ లను ఇచ్చి ఉండొచ్చు. కాని సర్దార్ ఆడియోలో ఆయన ఇచ్చిన ప్రసంగం ప్రత్యేకమైనది. చిరు ఇంత ఎమోషనల్ గా మాట్లాడడానికి ఓ కారణముంది.

రాజకీయంగా కొన్ని విబేధాలు రావడంతో బిడ్డ లాంటి పవన్ కళ్యాన్ మూడు సంవత్సరాలుగా చిరంజీవి దూరంగా ఉన్నారు. తను అనుభవించిన ఆ బాధ అంతా చిరంజీవి ముఖంలో, తన మాటల్లో క్లియర్ గా అర్ధమవుతుంది. చిరంజీవిను సర్దార్ ఫంక్షన్ కు పిలవలేదని కొన్ని రూమర్స్ వినిపించాయి. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా స్పీచ్ ను ఇవ్వడంతో పాటు తన తమ్ముడు తనని షూటింగ్ స్పాట్ కి ఆహ్వానించాడు, ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానించాడు అనే సంతోషం చిరంజీవి కళ్ళలో కనిపించింది.