Begin typing your search above and press return to search.
మాటీవీ ప్రోగ్రాంను చిరు వద్దనుకున్నాడట కానీ..
By: Tupaki Desk | 26 Jun 2016 5:45 AM GMTఅప్పుడెప్పుడో ఓసారి తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల్లో ఒక్కసారి మాత్రమే స్టేజ్ మీదెక్కి పెర్ఫామెన్స్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇంకెప్పుడూ ఆయన స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. చిన్నా చితకా హీరోలు సైతం స్టేజ్ పెర్ఫామెన్స్ ఇవ్వడాన్ని తక్కువగా భావిస్తారు. అలాంటిది చిరంజీవి లాంటి మెగా స్టార్.. ఓ టీవీ ఛానెల్ అవార్డుల కార్యక్రమంలో స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తాడని.. రకరకాల వేషాల్లో ప్రోగ్రాం చేస్తాడని ఎవ్వరూ అనుకోరు. కానీ మాటీవీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇదంతా చేసి ఆశ్చర్య పరిచారు. మరి చిరును ఆ దిశగా మోటివేట్ చేసిందేంటి? ఆయన ఈ పెర్ఫామెన్స్ ఇచ్చే విషయంలో ఏం సందేహించలేదా..? ఆయన ఎందుకీ ప్రోగ్రాంకు ఒప్పుకున్నారు..? చిరు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘మా టీవీ వాళ్ళు వచ్చి.. అవార్డుల కార్యక్రమంలో ప్రోగ్రాం చేయమన్నప్పుడు వెంటనే ఒప్పుకోలేదు. అందుకు నేను సుముఖంగా లేను. ఓ పక్క నా రీఎంట్రీ మూవీకి సంబంధించి కథా చర్చలు.. మరోపక్క కాస్ట్యూమ్స్ లాంటి పనులతో తీరిక లేకుండా ఉన్నా. ఇలాంటి టైంలో ఇది ఎక్ స్ట్రా ప్రెజర్ అవుతుందనిపించింది. తర్జనభర్జన పడ్డాను. పైగా ఓ మైల్ స్టోన్ మూవీ చేయబోతూ.. ఇలా ఓ అవార్డుల కార్యక్రమంలో కనబడటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అనుమానం కలిగింది. కానీ మాతో నాకు మొదటి నుంచి ఆత్మీయ అనుబంధం ఉంది. పైగా వారితో నాకు వ్యాపార అనుబంధం కూడా ఉంది. దీంతో అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ల అభ్యర్థనను ఒప్పుకున్నా. నా పునరాగమనానికి ఇది ఓ టెస్టులాగా కూడా ఉంటుందని ఓకే చెప్పా. ఆ ప్రోగ్రాం కోసం ఆరు గెటప్పులు.. 5 పాత్రలు వేశాను. ఒకే రోజు వీటన్నింటి షూటింగ్ పూర్తి చేసేశారు. రిహార్సల్ చూసుకుని ‘గ్యాంగ్ లీడర్’ పాటకు స్టెప్పులేశా.
శ్రీకాంత్..సునీల్..నవదీప్..సాయిధరమ్ తేజ్... వీళ్లందరూ కూడా నాతో డ్యాన్స్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆ పాటకు డ్యాన్స్ చేస్తుంటే నా ఒంట్లో తెలియని ఉత్సాహం నిండిపోయింది. నా నుంచి జనం ఏం కోరుకుంటున్నారో అది అందించాను. అందరూ మెచ్చుకున్నారు. సంతోషించారు’’ అని చిరంజీవి చెప్పాడు.