Begin typing your search above and press return to search.
పెద్దాయన్ని పర్సనల్ గా పిలవలేదనే
By: Tupaki Desk | 26 Aug 2015 7:08 AM GMTమెగా ఈవెంట్ ముగిసినా.. దాని పర్యవసానం ఒకటి మిగిలే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి బోలెడంత మంది సెలబ్రిటీలు వచ్చి కన్నుల పండువగా మెగా బి-డే ఉత్సవాన్ని తిలకించి, అటుపై విందు ఆరగించి వెళ్లారు. అయితే వీళ్లలో చాలామందిని రామ్ చరణ్ అండ్ టీమ్ వ్యక్తిగతంగా కలిసి ఇన్విటేషన్ తో పిలిచారు. టాలీవుడ్ వెటరన్ దర్శకులు దాసరి నారాయణరావు కనిపించకపోవడం ఇప్పుడు పెద్ద డిష్కసన్ పాయింట్ అయ్యింది. పెద్దాయన లేక వేదిక వెలవెలబోయిందే అన్న విమర్శ కూడా వినిపించింది.
చరణ్ అండ్ టీమ్ దాసరిని వ్యక్తిగతంగా కలిసి వేడుకకు ఆహ్వానించకపోవడం వల్లే దాసరి డుమ్మా కొట్టారు. ఆ సంగతిని దాసరి స్వయంగా చెప్పారు. ఒకవేళ నన్ను పర్సనల్ గా కలిసి ఇన్వయిట్ చేసి ఉంటే వచ్చేవాడినే. మా మధ్య ఉన్న వైరాన్ని కూడా వదిలేసే వాడిని. కానీ అలా చేయలేదు కదా! అని దాసరి వ్యాఖ్యానించడం చర్చల్లోకొచ్చింది. చరణ్ అందరికీ పంపినట్టే ఓ ఆహ్వాన పత్రిక రెగ్యులర్ పోస్ట్ లో పంపించేశాడు. అందుకే దాసరి చిరుపై కినుక వహించారని ఫిలింనగర్ జనాలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.
అప్పట్లో దాసరితో చెర్రీ ఎపిసోడ్ గురించి అందరికీ తెలుసు కాబట్టి, ఫ్లాష్ బ్యాక్ గురించి మరోసారి తవ్వుకుంటున్నారంతా. చరణ్ అలా చేసి ఉండాల్సింది కాదు, ఫ్యామిలీలో కీలకమైన సందర్భం కాబట్టి అన్నీ వదిలేసి వ్యక్తిగతంగా కలిపేసుకుంటే పోయేది అంటూ జనం గొణుక్కుంటున్నారు. ఇట్స్ టూ బ్యాడ్!