Begin typing your search above and press return to search.
పవన్ కు స్పెషల్ ఫ్లైట్.. దిల్ రాజు ఎందుకిచ్చారు?
By: Tupaki Desk | 3 Feb 2020 8:31 AM GMTఆర్థిక అవసరాలో.. లేక పార్టీకి ఫండ్ కోసమే.. వ్యక్తిగత ఖర్చులో కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల బాటపట్టాడు. హిందీలో విజయవంతమైన ‘పింక్’ రీమేక్ మూవీలో నటిస్తున్నారు. ఆయనకున్న లక్షలాది మంది ఫ్యాన్స్ కు ఊరటనిచ్చారు. పవన్ సినిమాల బాట పట్టడం రాజకీయంగా విమర్శలు ఎదురైనా కానీ పవన్ మాత్రం అవన్నీ పక్కనపెట్టి సినిమాను కొనసాగిస్తున్నారు.
అయితే సినిమాలు చేయనని.. ఇక తన జీవితం రాజకీయాలకే అంకితమన్న పవన్ కళ్యాణ్ మనసు మార్చి.. పవన్ తో సినిమా తీయాలన్న ఏకైక కోరికను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్ నెరవేర్చుకుంటున్నారు. ఇందుకోసం పవన్ కు కళ్లు చెదిరేలా 50 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్టు టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. ఇంత భారీ మొత్తం ఆఫర్ చూసే పవన్ సినిమా ఒప్పుకొని చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఇక తన జీవితం రాజకీయాలకు అంకితమతన్న పవన్ ను మాట తప్పేలా చేయడంలో దిల్ రాజు విజయం సాధించారని చెప్పవచ్చు.
పోనీ లే.. ఎలా అయితే ఏంటి మా ‘పవన్’ సినిమా చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. అయితే ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించి.. పవన్ ను ప్రశాంతంగా షూటింగ్ జరుపుకోనివ్వకుండా చేస్తున్నారు. దీంతో ఉదయం ఉద్యమాలు, సాయంత్రం షూటింగ్ లంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రత్యేక విమానంలో చక్కర్లు కొడుతున్నారు. సాధారణంగా కారులో వచ్చే పవన్ ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. దాని కథ వేరే ఉందట..
పవన్ ‘పింక్ రిమేక్’కు ముందే దిల్ రాజుకు స్పష్టం చేశాడట.. తనకు రాజకీయం ముఖ్యమని.. ఏ సమస్య వచ్చినా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి వెళతానని ఒప్పందం చేసుకున్నాడట.. దీంతో దిల్ రాజు కూడా సరేనని పవన్ ఖాళీ టైంలోనే సినిమా షూటింగ్ జరుపుతున్నారట..
పవన్ రాజకీయాల కోసం సినిమా షూటింగ్ లు బంద్ చేయడం ఇష్టంలేని నిర్మాత దిల్ రాజు ఏకంగా రాజకీయం, సినిమా షూటింగ్ రెండూ జరిగేలా పవన్ కోసం ఏకంగా ప్రత్యేక విమానాన్ని బుక్ చేశారు.. ఉదయం షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం చేరుకొని అమరావతిలో పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. రాత్రికి హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ లో పాల్గొని సినిమా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా సినిమాలు, రాజకీయం బ్యాలెన్స్ చేస్తూ కష్టపడుతున్నారు. పవన్ ప్రయాణిస్తున్న విమాన ఖర్చు దాదాపు కోటి రూపాయలను నిర్మాత దిల్ రాజు భరిస్తున్నాడట..
తాజాగా జనసేన ముఖ్యనేత, పవన్ రైట్ హ్యాండ్ అయిన నాదెండ్ల మనోహర్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమా చేయడంపై నోరువిప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయానికి ఫస్ట్ ప్రిపరెన్స్ అన్నాడని.. నిర్మాత దిల్ రాజుకు ముందే చెప్పాడని.. అందుకే అది డిస్ట్రబ్ కాకుండా ఉండేందుకు 30 రోజులపాటు దిల్ రాజే విమానాన్ని బుక్ చేసి షూటింగ్ నిర్వహిస్తున్నాడని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ రాజకీయ జీవితం, సినిమా జీవితం కోసమే నిర్మాత దిల్ రాజు ప్రత్యేక విమానాన్ని సమకూర్చారని నాదెండ్ల తెలిపారు. పింక్ మూవీ కోసం పవన్ కేవలం 30 రోజుల పాటు కాల్ షీట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.
అయితే చాలా గ్యాప్ ఇచ్చి పవన్ సినిమాలు చేస్తుండడం.. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం.. ఖర్చు ఖచ్చితంగా తిరిగి వస్తుందన్న నమ్మకంతో దిల్ రాజ్ తాజాగా ‘పింక్’ రిమేక్ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే పవన్ కోసం ఏకంగా కోటి రూపాయలు పెట్టి విమానాన్ని సమకూర్చినట్టు అర్థమవుతోందంటున్నారు.