Begin typing your search above and press return to search.

జెర్సీ ఈవెంట్.. డైరెక్ట‌ర్ స్కిప్ కార‌ణం?

By:  Tupaki Desk   |   16 April 2019 10:01 AM GMT
జెర్సీ ఈవెంట్.. డైరెక్ట‌ర్ స్కిప్ కార‌ణం?
X
చివ‌రి బంతి వ‌ర‌కూ పోరాడ‌టమే నా విజ‌య ర‌హ‌స్య ం అన్నాడు ఎం.ఎస్.ధోని. టాలీవుడ్ లో ప్ర‌వేశిస్తున్న ఈ యంగ్ డైరెక్ట‌ర్ పంథా కూడా అలానే ఉందిట‌. నిన్న‌టిరోజున త‌న లైఫ్ లో ఎంతో కీల‌క‌మైన ఈవెంట్ జ‌రిగితే డైరెక్ట‌ర్ అయి ఉండీ దానికి స్కిప్ కొట్టేయ‌డమేంటి? అంటూ జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఓ షాకింగ్ నిజం తెలిసింది. ఈవెంట్ లో హీరో ఉన్నాడు.. హీరోయిన్ ఉంది. స్పెష‌ల్ గెస్ట్ వెయిటింగ్.. ఇత‌ర‌త్రా చిత్ర‌యూనిట్ అంతా ఉన్నారు. కానీ ద‌ర్శ‌కుడు లేడు. ఈవెంట్ హీరో అయిన‌ సంగీత ద‌ర్శ‌కుడు అస‌లే క‌నిపించ‌లేదు. దీంతో ఆ ఇద్ద‌రూ స్కిప్ కొట్ట‌డానికి కార‌ణ‌మేంటి? ఏవైనా విభేధాలేర్ప‌డ్డాయా? అంటూ ఒక‌టే ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డితో ఆడే జూదంలో చివ‌రి బంతి వ‌ర‌కూ ఆడేదెవ‌రో ఎవ‌రూ చెప్ప‌లేరిక్క‌డ‌. అందుకే ఈ సందేహం వ్య‌క్తమైంది. అస‌లే స్పోర్ట్స్ నేప‌థ్య ంలో సినిమా. పైగా ఉడుకు ర‌క్తం టీమ్ గా క‌లిసి ప‌ని చేయ‌డంతో సందేహించారు.

మొత్తానికి జెర్సీ ఈవెంట్ కి ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ రామ‌చంద్ర‌న్ ఎందుకు స్కిప్ కొట్టారో చిత్ర క‌థానాయ‌కుడు నానీయే స్వ‌యంగా చెప్పారు. అనిరుధ్ వేరొక కార్యక్ర‌మంలో చాలా బిజీగా ఉన్నారు. దాని వ‌ల్ల రాలేక‌పోయారు. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ చెన్న‌య్ లో `జెర్సీ` ఫైన‌ల్ డిస్క్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అది రాగానే అమెరికాకి పంపాల్సి ఉంది. ఆ ప‌ని వ‌ల్ల‌నే ప్రీరిలీజ్ వేడుక‌కు రాలేక‌పోయాడు అని తెలిపారు.

హీరో నాని మాట్లాడుతూ -``ఏప్రిల్‌ 19న జెర్సీ సినిమా చూసి.. అందరూ చాలా గర్వపడతారు. గౌతమ్‌ ని చూసి.. అర్జున్ ని చూసి.. నానిని చూసి.. శ్రద్ధను చూసి అందరూ గర్వపడతారు. బ్లాక్‌ బస్టర్‌ వంటి మాటలు నాకు ఆనడం రాదు. గొప్ప సినిమాలో చేశాననే తృప్తి ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందు గౌతమ్‌ గురించి చెప్పాలి. గౌతమ్ ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు. యు.ఎస్‌. ప్రింట్స్‌ ఈ రోజు(సోమ‌వారం ) 9 గంటలకు వెళ్తాయి. వాటికోసం అక్కడే ఉన్నాడు. మ‌ధ్యాహ్నానికే ఆ ప‌నిలో క్లారిటీ వ‌చ్చేశాక‌... సాయంత్రం ఈవెంట్ కి వ‌చ్చెయ్ అని ఫోన్ చేసి చెప్పాను. కానీ రాత్రి 9 వ‌ర‌కూ ఉండ‌గ‌లిగితే ఇంకా మంచి ఔట్ పుట్ వ‌స్తుంద‌నే వెయిట్ చేస్తున్నాను. ఈవెంట్ కి రాలేన‌ని అన్నాడు`` అని చెప్పారు. చివ‌రి బంతి వ‌ర‌కూ పోరాడే కోవ‌కు .. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఎడిష‌న్లు తీసుకుని ప‌రీక్ష రాసే విద్యార్థి కోవ‌కు కొంద‌రే చెందుతారు. ఆ కోవ‌కే చెందిన డెడికేటెడ్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ అని నాని మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మైంది. ఏప్రిల్‌ 19న జెర్సీ థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. రిలీజ్ త‌ర్వాత డైరెక్ట‌ర్ ప‌నిత‌నంపై విశ్లేష‌కులు ఏమంటారో వేచి చూడాలి.