Begin typing your search above and press return to search.

మరో హీరోయిన్ డైవర్స్.. కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   18 Aug 2016 4:18 AM GMT
మరో హీరోయిన్ డైవర్స్.. కారణం ఇదేనా?
X
ఈమధ్యకాలంలో అమలా పాల్ విడాకులకు సంబందించిన విషయం అటు సినీ వర్గాల్లోనూ - ఇటు సామాన్య ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అమలాపాల్ వ్యవహారం అలా జరిగిందో లేదో ఇంతలోనే మరో మాజీ హీరోయిన్ తన భర్త నుంచి విడిపోనుంది. మళయాళి నటి - డాన్సర్ అయిన దివ్య ఉన్ని.. తన భర్త డాక్టర్ సుధీర్ సుధాకరన్ నుంచి విడిపోతోందని వార్తలొస్తున్నాయి. పెళ్లై ఇప్పటికి సుమారు 14 సంవత్సరాల కాబోతున్నా తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడంతో ఇప్పుడు మళయాళి సిని పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. దివ్య ఉన్ని భర్త నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే.. భర్త సుధీర్ అక్రమ సంబంధం - అతనికున్న ఈగో కారణాలని తెలుస్తుంటే.. కెరీర్ పై దృష్టిపెట్టనివ్వడంలేదనేది మరోకారణంగా చెబుతున్నారు.

మళయాలి నటి - డాన్సర్ అయిన దివ్య ఉన్నై.. తెలుగు - తమిళ సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో వేణు హీరోగా వచ్చిన ఇల్లాలు.. ప్రియురాలు చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అయితే చిన్నప్పటినుంచి డాన్స్ పైనా - నటన పైనా ఆసక్తి ఉన్న దివ్య.. తాజాగా డాన్స్ స్కూలు పెట్టిందట. ఈ వ్యవహారం తన భర్తకు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. నటన - డాన్స్ అంటూ కుటుంబాన్ని పట్టించుకోవటం మానేస్తుందని - ఇంట్లోనే ఉండమని భర్త చాలాసార్లు ఆదేశించాడట కూడా. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన దివ్య.. కుటుంబం కోసం ఇప్పటివరకూ చాలా త్యాగాలు చేసానని - ఇక తన వల్ల కాదని చెప్పిందట. ఇదే సమయంలో డాన్స్ స్కూల్ మూసేయటం కుదరదని కూడా స్పష్టంగా చెప్పడంతో ఇక విడాకులే అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై ఇరు వైపులకు చెందిన కుటుంబాల వారు ఎంత రాజీకి ప్రయత్నించినా.. వీరిద్ధరిలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గకపోవడంతో.. విడాకులకు అప్లై చేయాల్సి వచ్చిందట. దీంతో ఇక ఆ కార్యక్రమం కూడా పూర్తయితే తిరిగి సినిమాల్లోకి రావాలని దివ్య ఉన్ని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే భర్త ఇంటినుంచి వచ్చేసిన దివ్య.. కొడుకు అర్జున్, కూతురు మీనాక్షి లతో పాటు తన తల్లితండ్రులతోనే ఉంటుంది. కాగా దివ్య ఉన్న తన ఏడో ఏట నుంచే నుంచే సినిమాల్లో నటిస్తూ, డాన్స్ అంటే ఆసక్తి చూపించేదని, ఇలాంటప్పుడు ఆమెను నటనకు - డాన్స్ కు దూరం చెయ్యటం అన్యాయం అనే అంటున్నారు దివ్య కుటుంబసభ్యులు.