Begin typing your search above and press return to search.

రాక్షసుడికి నష్టం జరిగిందక్కడే

By:  Tupaki Desk   |   9 Aug 2019 5:14 AM GMT
రాక్షసుడికి నష్టం జరిగిందక్కడే
X
ఎట్టకేలకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్టు కొట్టాడు అనే ఆనందం రాక్షసుడు ఎక్కువసేపు నిలవనీయడం లేదు . కారణం మొదటి మూడు రోజులు అయ్యాక వీక్ డేస్ లో కలెక్షన్స్ బాగా డ్రాప్ కావడం. సోషల్ మీడియా మొదలుకుని మౌత్ టాక్ దాకా అంతా పాజిటివ్ గానే ఉన్నా ఇలా జరగడం విచిత్రమే. దీనికి స్పష్టమైన కారణం లేకపోలేదు. ఒరిజినల్ వెర్షన్ రట్సాసన్ గత ఏడాది అక్టోబర్ 5న విడుదలైంది. ఇంకో రెండు నెలలు దాటితే ఏడాది పూర్తి చేసుకుంటుంది. రిలీజైన కొద్దిరోజులకే బ్లాక్ బస్టర్ టాక్ తో అక్కడ అదరగొట్టే కలెక్షన్లు తెచ్చుకుంది.

హైదరాబాద్ లో తమిళ్ సినిమాలు విడుదల కావడం కామనే కాని రట్సాసన్ రాకుండా జాగ్రత్తలు పడ్డారు. అది ఎక్కువ డ్యామేజ్ కాకుండా కాపాడింది. కానీ తెలుగు రీమేక్ విషయంలో జరిగిన తాత్సర్యం వల్ల ఇది అక్కడి శాటిలైట్ ఛానల్స్ లో రావడం సన్ నెక్స్ట్ లాంటి యాప్స్ తో పాటు హాట్ స్టార్ లో మలయాళ వెర్షన్ సబ్ టైటిల్స్ లో అందుబాటులో ఉండటంతో మూవీ లవర్స్ ఆగలేక వాటిలో చూసేశారు

దాంతో రాక్షసుడు వచ్చాక మక్కికి మక్కి సేమ్ ఉందనే టాక్ రావడంతో ఇంకోసారి ఏం చూస్తాంలే అనే అభిప్రాయంతో ఎక్కువ శాతం దూరంగా ఉండిపోయారు. ఒరిజినల్ చూడని వాళ్ళు మాత్రమే ధియేటర్ కు వెళ్లారు. ఒకవేళ ఈ రిమేక్ తక్కువ టైంలో అంటే మూడు లేదా ఐదు నెలల గ్యాప్ లో వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని వసూళ్లు కూడా చాలా బాగా వచ్చేవని ట్రేడ్ వర్గాల మాట. ముందు నితిన్ తో తీస్తారని ఓసారి లేదు ఇంకో యూత్ హీరో ఆసక్తి చూపారని మరోసారి ఇలా చేతులు మారుతూ వచ్చి ఆఖరికి సాయి శ్రీనివాస్ దగ్గరికి వచ్చింది. అయినా కుడా దాని ఫలాలు పూర్తిగా అందకపోవడం విచారకరం