Begin typing your search above and press return to search.
ఆ హడావుడే ‘సర్దార్’ను దెబ్బ తీసిందా?
By: Tupaki Desk | 9 April 2016 5:30 AM GMTయుఎస్ ప్రిమియర్స్ కలెక్షన్లలో రెండో స్థానం.. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో నాన్ బాహుబలి రికార్డులు.. ఇంకా వసూళ్ల పరంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రభంజనం బాగానే సాగుతోంది. వీకెండ్ కలెక్షన్ల విషయంలో నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ ‘సర్దార్’ బద్దలు కొట్టేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. కానీ వీకెండ్ తర్వాత నిలబడ్డమే.. ‘సర్దార్’ ముందున్న అసలు సవాల్. సినిమాకు మరీ పాజిటివ్ టాక్ లేదు.. అలాగే పూర్తి నెగెటివ్ టాక్ కూడా లేదు. ఫైనల్ గా సినిమా ఏంటి అన్నది సోమవారానికి కానీ తేలదు.
ఐతే సినిమా చూసిన విశ్లేషకుల్లో చాలామంది చెబుతున్న మాటేంటంటే.. ‘సర్దార్’ టీమ్ పడ్డ హడావుడే ఈ సినిమాకు శాపంగా మారిందని. ‘సర్దార్’ విషయంలో ప్రధానమైన కంప్లైంట్ ద్వితీయార్ధం గురించే. దాదాపు అరగంట పాటు సినిమాలో ఏ సన్నివేశాలొస్తాయో తెలియదు. ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. కథాగమనానికి అడ్డం పడుతూ ఇష్టానుసారం సన్నివేశాలు వచ్చిపోతుంటాయి. ఎడిటింగ్ విషయంలో దారుణమైన తప్పులు చోటు చేసుకున్నాయి. ఇష్టానుసారం కట్ అండ్ పేస్ట్ అన్నట్లుగా పని సాగిపోయిందని స్పష్టంగా అర్థమైపోయింది.
విలన్ గ్యాంగును సర్దార్ ఆటాడుకునే సన్నివేశాల్ని ఎలా పడితే అలా ఎడిట్ చేశారు. బ్రహ్మానందం-పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే గన్ ఫైట్ కూడా అంతే. ఇక టైటిల్ సాంగ్.. ఫారిన్ లో తీసుకొచ్చిన రెండు పాటలు కూడా పేలవంగా అనిపిస్తాయి. చాలా హడావుడిగా ముగించేసిన వైనం కనిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలకు ఓ కాన్సెప్ట్ అంటూ ఉండదు. ఏదో మొక్కుబడిగా అవగొట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. అసలీ పాటల్లో పవన్ కు సరిగా లిప్ సింక్ కూడా అవ్వలేదు.
‘సర్దార్’ సినిమా 70 శాతం చివరి 50 రోజుల్లోనే షూట్ చేశామని చెప్పాడు పవన్. అలా తీసిన సన్నివేశాల్ని సినిమాలో ఎలా పడితే అలా పేర్చేసినట్లున్నారు. నిడివి ఎక్కువైపోవడంతో కొన్ని సన్నివేశాల్ని ఇష్టానుసారం కట్ చేశారు. అవసరం లేని సన్నివేశాల్ని కూడా అలాగే వదిలేశారు. పవన్ ఎడిటింగ్ దగ్గర ఉండి.. బాబీతో కోఆర్డినేట్ చేసుకుని నెమ్మదిగా పని చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. బాబీ ఫ్రీ హ్యాండ్ తీసుకున్నట్లు లేదు. పవన్ పట్టించుకున్నట్లూ లేడు. మొత్తానికి సినిమా అలా తయారైంది.