Begin typing your search above and press return to search.

జెనీలియా పై సడన్ లవ్ ఏంటో!!

By:  Tupaki Desk   |   5 Aug 2016 3:15 PM GMT
జెనీలియా పై సడన్ లవ్ ఏంటో!!
X
మాజీ హీరోయిన్ పుట్టిన రోజుకి ఇండస్ట్రీ జనాలు విషెస్ చెప్పడం పెద్ద వింతేమీ కాదు. కానీ జెనీలియా బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ స్పందించిన తీరు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. నిజానికి ఈమె హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా ఇంత హంగామా నడవలేదన్నది చాలామంది మాట. హ్యాపీ బర్త్ డే అంటూ అమ్మడికి బోలెడంత మంది విషెస్ చెప్పిన తీరు చూస్తే.. ఇందుకు వేరే ఏదో కారణం ఉందా అనిపించడం సహజం.

జెన్నీకి ఈ రేంజ్ లో బర్త్ విషెస్ చెప్పడానికి కారణం వేరే ఉందన్న మాట వాస్తవమే. హీరోయిన్ ఓ రేంజ్ లో ఉన్నపుడే పట్టించుకోని జనాలు ఇప్పుడు హడావిడి పడ్డానికి కారణం జెన్నీ వెనక పొలిటకల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడమే. ఈమె భర్త రితేష్ దేశ్ ముఖ్ తండ్రి ఎవరో కాదు.. గతంలో మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన విలాసరావు దేశ్ ముఖ్. రితేష్ బ్రదర్ కూడా ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే. తమ్ముడు కూడా పొలిటిల్ ఎంట్రీకి గట్టిగానే ట్రై చేస్తున్నాడు.

నెక్ట్స్ టైం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రితేష్ అన్న మంత్రి అవుతాడని టాక్. అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న పరిచయమైన అమ్మాయిని పట్టించుకోకపోవడం అంటే.. ఫ్యూచర్ లో రాబోయే ప్రయోజనాలను వదులుకోవడమే. అందుకే జెనీలియా బర్త్ డేకి కుప్పలు తెప్పలుగా విషెస్ వచ్చి పడ్డాయి. ఈ భామ హీరోయిన్ గా కొనసాగినపుడు.. నిర్మాతల నుంచి గట్టిగానే రెమ్యూనరేషన్ వసూలు చేసేదని టాక్. అయినా సరే ఇప్పుడు విషెస్ చెప్పిన వాళ్లలో వాళ్లే ఎక్కువగా ఉన్నారు.