Begin typing your search above and press return to search.
సిద్దూ.. ఈ రచ్చ రాజకీయాల కోసమా?
By: Tupaki Desk | 10 Nov 2018 4:40 AM GMTతెలుగులో హీరోగా నటించి పలు సక్సెస్ లు దక్కించుకున్న సిద్దార్థ తెలుగులో వరుస ఫ్లాప్ లు పడటంతో తమిళంకు షిప్ట్ అయ్యాడు. అక్కడ కూడా వరుసగా ఫ్లాప్ లు రావడంతో అవకాశాలు సన్నగిల్లాయి. సినిమాల్లో ఆఫర్లు లేకున్నా కూడా సోషల్ మీడియాలో బర్నింగ్ ఇష్యూస్ పై తనదైన గళం వినిపించడం వల్ల సిద్దార్థ ఈమద్య కాలంలో మీడియాలో ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సిద్దార్థ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్తాడా ఏంటీ అంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ప్రకాష్ రాజ్ కూడా గతంలో తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాల పట్ల స్పందించడం - ఎప్పటికప్పుడు తన ఆలోచనలను - రాజకీయ నాయకులపై షాకింగ్ వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ప్రకాష్ రాజ్ ఆ తర్వాత మెల్ల మెల్లగా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే ప్రకాష్ రాజ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఈ సమయంలోనే సిద్దార్థ కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇలా తనకు సంబంధం లేని విషయాల్లో గళం వినిపించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.
ఏదైనా విషయంపై అవగాహణ పెంచుకుని - చక్కగా మాట్లాడటంతో పాటు - ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించే అంశాలను సిద్దార్థ మాట్లాడుతాడు. ఉన్నత విద్యావంతుడు అయిన కారణంగా ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉంది. అందుకే సిద్దార్థ భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఉండే అవకాశం లేకపోలేదు. సినిమాల్లో ఛాన్స్ లేని వారు వ్యాపారమో - రాజకీయమో చేయడం ఈమద్య సర్వ సాదారణం అయ్యింది.