Begin typing your search above and press return to search.

కండల హీరో ప్రపంచానికి ప్రూవ్‌ చేయాలా?

By:  Tupaki Desk   |   16 March 2016 6:49 AM GMT
కండల హీరో ప్రపంచానికి ప్రూవ్‌ చేయాలా?
X
సడన్‌ గా అసలు ఎవరో హీరోయిన్‌ చేసిన కామెంట్‌ పై హృతిక్‌ రోషన్‌ ఏకంగా కోర్టులో కేసు దాఖలు చేసేయాలా? అది చాలా ఓవర్‌ గా అనిపించట్లేదా? అయితే ఇక్కడ అందరూ ఓ విషయం అర్ధం చేసుకోవాలి. డైవర్స్‌ తీసుకున్న తరువాత హృతిక్‌ ఇమేజ్‌ బాగా డ్యామేజ్‌ అయ్యింది. అన్నేసి సంవత్సరాలు కాపురం చేసిన భార్య సుజానే ఖాన్‌ తో అసలు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న.

ముఖ్యంగా హృతిక్‌ కాసనోవా చేష్టలే ఈ డైవర్స్‌ కు కారణం అని అందరి నమ్మకం. మనోడు కైట్స్‌ సినిమా షూటింగ్‌ టైములో బార్బరా మోరితో ఎఫైర్‌ నడిపినట్లు. క్రిష్‌ 3 షూటింగ్‌ టైములో కంగనా రనౌత్‌ తో ఎఫైర్‌ లో మునిగితేలడానేది బాలీవుడ్‌ నమ్ముతున్న విషయం. ఈలోపు స్వయంగా సుజానే కు స్నేహితుడు అర్జున్‌ రాంపాల్‌ తో ఎఫైర్‌ ఉందంటూ ఒక వదంతి పుట్టుకొచ్చింది. కాని అది నిజం కాదని తేలడంతో.. సో.. హృతిక్‌ ఎక్సట్రాల వలనే ఆమె విడాకులు కోరుకుంది అనేది క్లియర్‌ అయిపోయింది. ఈ సమయంలో హీరోయిన్‌ కంగనా రనౌత్‌ మనోడి గురించి చేసిన కామెంట్లను వింటే.. నిజంగానే వీళ్ళ మధ్యన ఒక షార్ట్‌ లివ్డ్‌ ఎఫైర్‌ ఉందనేది మనం అనుకోవచ్చు.

అలా ఎవ్వరూ అనుకోకూడదు అని.. తాను ఒక శ్రీరామచంద్రుడిని అని ప్రపంచాన్ని నమ్మించాలంటే.. ఇలా కంగనపై కోర్టుకెళ్ళి అక్కడ ప్యూరిటి స్టాంపింగ్‌ వేయించుకొని రావాలి. అందుకే ఇలా కేసులూ గాడిద గుడ్డూ అంటూ హడావుడి చేస్తున్నాడని బాలీవుడ్‌ మీడియా ఇప్పుడు గుసగుసలాడుతోంది.