Begin typing your search above and press return to search.
పద్మావతిపై ఇంత హైప్ ఎందుకంటే..
By: Tupaki Desk | 10 Oct 2017 8:08 AM GMTసంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన పద్మావతి చిత్రానికి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతగా ఈ చిత్రానికి స్పందన రావడానికి.. ముందు యూనిట్ అంతా పక్కా వ్యూహాలు అనుసరించారు. మరి బాహుబలి నుంచి నేర్చుకున్నారో.. సొంతం గానే థింక్ చేశారో కానీ.. అసలు సినిమా గురించి చెప్పకుండానే.. మూవీ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ వరుసగా ఏదో ఒక విధంగా పద్మావతిని వార్తల్లో నిలపడంలో మాత్రం యూనిట్ బాగా సక్సెస్ అయింది.
మూవీ షూట్ ప్రారంభం కాగానే.. ప్రధాన పాత్రధారులు అయిన షాహిద్ కపూర్.. రణవీర్ సింగ్ ల మధ్య కోల్డ్ వార్ మొదలైందని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులకే అల్లావుద్దీన్ ఖిల్లీ పాత్రలో తన కేరక్టర్ ఎలో ఉండబోతోందో ఓ చిన్న పాటి లుక్ ని తనే లీక్ చేశాడు రణవీర్. మూవీకి వర్క్ చేస్తున్న ఓ పెయింటర్ అనుకోకుండా సెట్స్ లో మరణించడం కూడా ప్రచారానికి కారణం అయింది. జైపూర్ లో పద్మావతి షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడి జరిగింది. దీన్ని మాత్రం పక్కాగా ప్రచారానికి ఉపయోగించేశారు యూనిట్. దాదాపుగా ప్రతీ బాలీవుడ్ సెలబ్రిటితో ఈ విషయంపై ఖండన ఇప్పించారు.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా పద్మావతికి దీపికా పదుకొనే ప్రచారం చేయడం.. ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో తలకు గాయం కావడంతో.. రణవీర్ సింగ్ ను హాస్పిటల్ లో చేర్చాల్సి రావడం.. హాట్ టాపిక్ అయిపోయింది. ఓ సారి అయితే.. అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన రణవీర్ గ్ లుక్ అందరికీ షాక్ ఇచ్చేసింది.
ఇక పబ్లిసిటీ వర్క్స్ మొదలుపెట్టాక.. షాహిద్ కత్తి యుద్ధాలు నేర్చుకునే ఫోటోలు బాగానే హల్ చల్ చేశాయి. అల్లావుద్దీన్ ఖిల్లీ పాత్రను బైసెక్సువల్ గా చూపించనున్నారనే న్యూస్ కూడా హాట్ టాపిక్ అయిందని చెప్పాలి. పద్మావతి ఫస్ట్ లుక్ ఇచ్చినపుడు.. దీపికా పదుకొనేను చూసి చాలామంది షాక్ తినేశారు. ఈ సినిమాలో నటించిన ఖిల్జీ పాత్ర ప్రభావంతో మొదట రణవీర్ సింగ్.. ఆత్మత్యాగం సీన్ చేసిన తర్వాత దీపికా పదుకొనే.. ఇద్దరూ సైక్రియాట్రిస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందనే న్యూస్ కూడా బాగానే హల్ చల్ చేసింది.
ఈ చిత్రం విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పడం కూడా ఓ ప్రచార సాధనమే. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక సెన్సేషన్స్ చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రానికి ఇప్పుడింత హైప్ వెనుక.. ఇంత తతంగం జరిగింది మరి.