Begin typing your search above and press return to search.
జయసుధ భర్త మృతిపై పోలీసులు తేల్చేశారు
By: Tupaki Desk | 15 March 2017 4:13 AM GMTదిల్ రాజు భార్య హఠాన్మరణం తాలూకు షాక్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఇంకా కోలుకోనే లేదు. అంతలోనే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ తుది శ్వాస విడిచారు. 58 ఏళ్ల నితిన్ కపూర్ మంగళవారం మధ్యాహ్నం ముంబయిలోని తాను నివాసముండే ఫ్లాట్ (ఆరో అంతస్థు) నుంచి కిందికి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. ముందు పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతి కింద పేర్కొన్నారు. కేసు కూడా ఆ ప్రకారమే నమోదు చేశారు. కానీ సాయంత్రానికి స్పష్టత వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి నితిన్ మృతిపై సందేహాలేమీ లేవని తేల్చేశారు. ఆయనది ఆత్మహత్యే అని చెప్పారు.
నితిన్ దాదాపు రెండేళ్ల నుంచి డిప్రెషన్లో ఉన్నట్లు వెల్లడైంది. ఆయన ఏడాదిన్నరగా సైక్రియాట్రిస్టును కూడా కలుస్తూ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారట. మధ్యలో కొంత కోలుకున్నా మళ్లీ డిప్రెషన్ ఎక్కువైనట్లు చెబుతున్నారు. నితిన్ ఇంతకుముందు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా చెబుతున్నారు. నితిన్ అసలు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్లాడన్నదానికి సమాధానం లేదు.
బాలీవుడ్ హీరో జితేంద్ర సోదరుడైన నితిన్.. జయసుధను పెళ్లాడటం ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యాడు. చాలా సింపుల్ గా ఉండే నితిన్.. మీడియాలో కనిపించడం తక్కువ. జయసుధతో ఆయన చాలా అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించేవారు. కుటుంబ పరంగా ఏ సమస్యలూ లేవని అంటున్నారు. కానీ ఆయన ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. నితిన్ కపూర్.. బాలీవుడ్ హీరో జితేంద్రకు సోదరుడు. ఆయన కుటుంబానికి ముంబయిలోవ్యాపారాలున్నాయి. జయసుధను పెళ్లాడాక ఆమెతో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. 1985లో జయసుధను నితిన్ వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరికీ నిహార్.. శ్రేయన్ అనే ఇద్దరు కొడుకులున్నారు. శ్రేయన్ బస్తీ అనే సినిమాతో హీరో కూడా అయ్యాడు. అతను షూటర్ కూడా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/