Begin typing your search above and press return to search.
ఈ పరిస్థితికి కారణం ఎవరు కబాలి?
By: Tupaki Desk | 23 July 2016 9:14 AM GMTపబ్లిసిటీ ఆకాశాన్ని తాకగా.. అంచనాలు అంతకుమించి చేరాయి. నిన్నమొన్నటివరకూ యావత్ సినిమా లోకం "కబాలి" గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. రజనీ రఫ్ లుక్ - స్టైలిష్ వాక్ - సూపర్బ్ ట్రైలర్ - ఎక్సలెంట్ పోస్టర్ వెరసి కబాలి సినిమా పై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. శుక్రవారం సినిమా విడుదలయ్యింది.. మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫలితం మాత్రం బాగుంది - బాగానే ఉందికి మధ్యలోనే ఉండిపోతుంది తప్ప.. ఎక్సలెంట్ - సూపర్ - బ్లాక్ బాస్టర్ వంటి పదాలను చేరలేకపోయిందనేది అధికశాతం ఆడియెన్స్ అభిప్రాయంగా ఉంది!!
ఆ సంగతి అటుంచితే.. ఇప్పుడు రజనీ అభిమానులు పెయిన్ సంగతి పక్కనపెట్టి పోస్ట్ మార్టం చేసేపనిలో పడ్డారు. అసలు ఈ సినిమా ఈ పరిస్థితిలో మిగలడానికి కారణం ఎవరు - ఏమిటి అనే అంశాలను పరిశీలిస్తున్నారట. ఎటుచూసినా కూడా అందరి దృష్టి పా రంజిత్ వైపే తిరగడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. రాకెట్ ను ఇస్తే.. అంతరిక్షానికి పోవాలి తప్ప, దాన్ని వీపుగోక్కోవడానికి వాడటం పొరబాటుకాక మరేమిటనేది కొందరి ప్రశ్న! కబాలి నిర్మాత అతిగా చేసిన పబ్లిసిటీ - అభిమానులు రజనీ నుంచి ఏమి ఆశిస్తారనే అవగాహనను దర్శకుడు మరవడమే కారణం అని తేలుస్తున్నారు ఇంకొందరు.
పోస్ట్ మార్టం సంగతి కాసేపు పక్కనపెట్టి ఇక కబాలి కలక్షన్స్ విషయానికొస్తే.. విదేశాల సంగతి కాసేపు పక్కనపెడితే ముఖ్యంగా తమిళ - తెలుగు బాషలే ఈ విషయంలో కీలకం. తమిళంలో సుమారు 80 కోట్ల బిజినెస్ చేసిన కబాలి - తెలుగులో సుమారు 32 కోట్లమేర చేసిందని వినికిడి. ఈ లెక్కన చూసుకుంటే తెలుగులో తొలిరోజు వసూళ్లు 8 కోట్లు అని అంటున్నారు. ఈ లెక్కన మిగిలిన రోజుల్లో ఆ స్థాయి రాబడి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నే. అయితే తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా వసూలు రాబట్టడం కాస్త ఉపశమనమనే చెప్పాలి. ఏది ఏమైనా.. టాక్ - రివ్యూ - అభిమానుల మాటల సంగతి పక్కన పెడితే.. కబాలి హిట్ అనిపించుకోవాలంటే 170 కోట్లు వసూలు చేయాలనేది మాత్రం వాస్తవమనే చెప్పాలి!!