Begin typing your search above and press return to search.

మెగా151.. కాజల్ అందుకే వద్దందా?

By:  Tupaki Desk   |   27 Sept 2017 10:29 PM IST
మెగా151.. కాజల్ అందుకే వద్దందా?
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ తన పాత ఫామ్ ను అందేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సీటు నుంచి తనను ఎవరూ కదపలేరని చెప్పకనే చెబుతోంది. వరుస ఫ్లాప్స్ లో ఉండగా.. కాజల్ ఇలా రీబౌంట్ అయేందుకు ఆమెకు బాగా హెల్ప్ అయిన మూవీ మెగాస్టార్ ఖైదీ నంబర్ 150. అక్కడి నుంచి కాజల్ కు అన్నీ సక్సెస్ లు వరించేస్తున్నాయి.

ఇలాంటి సమయంలో కాజల్ అగర్వాల్ కు మెగా క్యాంప్ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందట. సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలకమైన పాత్రను కాజల్ కు ఆఫర్ వెళ్లిందని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ముందు నుంచే టాక్ ఉంది. ఇద్దరు భార్యలతో పాటు మరో మహిళతో కూడా ఉయ్యాలవాడ జీవితం ఉంటుంది. లీడ్ హీరోయిన్ నయనతార కాగా.. మరో హీరోయిన్ పాత్రను బాలీవుడ్ భామతో చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ మూడో రోల్ ను కాజల్ కు ఆఫర్ చేయగా.. ఆమె సున్నితంగా తప్పుకుందని అంటున్నారు. అయితే.. ఇలా ఆ రోల్ బేస్ చేసుకుని కాజల్ ఈ కేరక్టర్ ను.. మెగా ఆఫర్ ను కాదనకపోవడమే అసలు విశేషం.

ఇప్పటివరకూ ఏ ఒక్క హీరోతోనూ కాజల్ వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించలేదు. ఎవడు.. గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో మాత్రమే రామ్ చరణ్ కి జోడీగా వరుసగా నటించింది. అయినా సరే ఎవడు చిత్రంలో ఈమె అల్లు అర్జున్ కి హీరోయిన్. ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువ. ఇలా ఒకే హీరోతో వరుసగా రెండు సినిమాలు చేయడం తన మెంటాలిటీకి.. అలవాటుకు తగదు అంటూ.. అత్యంత సున్నితంగా సైరా మూవీకి సై అనడం మానేసిందట కాజల్ అగర్వాల్.