Begin typing your search above and press return to search.
కమల్ చిత్రం ఎందుకు ఆగినట్టు?!
By: Tupaki Desk | 3 Feb 2016 11:30 AM GMTఅమ్మ నాన్న ఆట... అంటూ కమల్ ప్రకటించగానే అందరూ ఆ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ చిత్రంలో కమల్ సరసన అమల నటిస్తుందని తెలియడంతో ప్రాజెక్టుపై మరింత క్రేజ్ ఏర్పడింది. పుష్పకవిమానం తర్వాత కమల్ - అమల నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో వ్యాపార వర్గాలు కూడా అమ్మ నాన్న ఆటపై ప్రత్యేకమైన ఆసక్తిని ప్రదర్శించారు. అమెరికాలో చిత్రీకరించేందుకు కమల్ చురుగ్గా ఏర్పాట్లు చేశాడు. అమల కూడా కాల్షీట్లు కేటాయించింది.ఒకట్రెండుసార్లు ఆమె అమెరికా కూడా వెళ్లొచ్చినట్టు తెలిసింది. అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ... అర్ధంతరంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కమల్ స్వయంగా ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు.
టి. కె. రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో తదుపరి ఓ కొత్త కథతో అదే దర్శకుడితో సినిమా చేయాలని కమల్ ఆలోచిస్తున్నాడట. ఇంతకీ అమ్మ నాన్న ఆటకి ఏమైందన్నది మాత్రం బయటికి రాలేదు. అమల కాల్షీట్లవల్లే సమస్య వచ్చిందా లేక కథలో లోపాలేమైనా ఉన్నాయా లేక ఆ రెండు కారణాలు కాకుండా కొత్తగా ఇంట్రస్టింగ్ కథేదైనా తట్టిందా? అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే టి.కె.రాజీవ్ దర్శకత్వంలోనే తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించిన కమల్ ఆ చిత్రంలో అమల ఉంటుందని మాత్రం చెప్పలేదు.