Begin typing your search above and press return to search.

భారతీయుడు సీక్వెల్ అందుకేనా??

By:  Tupaki Desk   |   3 Oct 2017 6:13 AM GMT
భారతీయుడు సీక్వెల్ అందుకేనా??
X
కమల్ హాసన్ హీరోగా అప్పట్లో వచ్చిన భారతీయుడు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. సగటు ప్రేక్షకుడు కూడా కనెక్టయ్యే సామాజిక అంశంతో కూడిన కథ... కమల్ హాసన్ నట విశ్వరూపానికి శంకర్ దర్శకత్వ ప్రతిభ తోడవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మేకప్ లతో సరికొత్త గెటప్ లలో కనిపించడం అనే ట్రెండ్ ఈ సినిమా నుంచే స్టార్టయింది. అయితే అసలు ఇప్పుడు సీక్వెల్ ఎందుకు తీస్తున్నట్లు?

భారతీయుడు సినిమా విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత దానికి సీక్వెల్ తీయాలని డైరెక్టర్ శంకర్ డిసైడయ్యాడు. ఇందులోనూ కమల్ హాసనే హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడు. తెలుగు - తమిళ్ రెండు భాషల్లోనూ దిల్ రాజే నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాను తీయడానికి ముఖ్య కారణం.. కమల్ హాసన్ తన పొలిటికల్ ఎంట్రీకి వాడుకోవడం కోసమేనట. గతంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ఆయనకు బొబ్బిలి పులి.. సర్దార్ పాపారాయుడు వంటి సినిమాలు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. కాని చిరంజీవి పవన్ కళ్యాణ్‌ వంటి హీరోలు అలా ఒక పేట్రియాటిక్ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయారు. అవన్నీ చూసిన కమల్.. ఇప్పుడు తనను తాను ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిగా ప్రొజెక్టు చేసుకోవడానికే ఈ సినిమా తీస్తున్నారని అంటున్నారు సినిమా వర్గాలు.

ఇకపోతే శంకర్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనితో 2.0 సినిమా డైరెక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు బాహుబలిని మించి ఖర్చు చేస్తుండటం విశేషం. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 400 కోట్ల వరకు చేరుకుందని కోలీవుడ్ టాక్. 2.0 పనులు పూర్తయ్యాక శంకర్ వచ్చే ఏడాది నుంచి భారతీయుడు-2 సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశముంది.