Begin typing your search above and press return to search.
కమల్ ట్విట్టర్లోకి ఎందుకొచ్చాడంటే..?
By: Tupaki Desk | 3 Feb 2016 3:30 PM GMTవారం కిందట గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ ట్విట్టర్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిగతా హీరోల్లా సరదా ముచ్చట్లేమీ చెప్పకుండా తనదైన శైలిలో జనగణమన పాట పాడి ఆ వీడియోతో అభిమానుల్ని పలకరించాడు కమల్. ఈ పాట ద్వారా తాను ట్విట్టర్లోకి అడుగుపెట్టిన ఉద్దేశం వేరని చెప్పకనే చెప్పాడు కమల్. తాజాగా తాను ట్విట్టర్లోకి రావడానికి కారణం కూడా చెప్పాడు కమల్. ఈ విషయంలో తనకు స్ఫూర్తి మహాత్మా గాంధీనే అన్నాడు.
‘‘నేను సోషల్ మీడియాలోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది మహాత్మా గాంధీనే. విమర్శకులకు భయపడకూడదని, ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడాలని ఆయన నుంచే తెలుసుకున్నా. అసలు మాట్లాడ్డమే ప్రమాదంగా ఉన్న రోజుల్లో ఆయన ధైర్యంగా ముందుకొచ్చి తాను చెప్పాలనుకున్నది చెప్పారు. ఆయన గొప్ప హీరో’’ అని కమల్ అన్నాడు.
ఐతే మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ తక్కువ అని.. సినిమా వాళ్లు ఏదైనా స్వేచ్ఛగా తమ సినిమాల్లో చెప్పే పరిస్థితి లేదని కమల్ అన్నాడు. ‘‘మిగతా ప్రపంచంలో లాగా ఏ ఇండియన్ ఫిల్మ్ మేకర్ కూడా తన భావాల్ని స్వేచ్ఛగా సినిమాల్లో చూపించే అవకాశం లేదు. ఈ విషయంలో నాకింకా పూర్తి స్వాత్రంత్యం రాలేదని అనిపిస్తుంటుంది. మనకు మనం లక్ష్మణ రేఖ గీసుకుని ఏదైనా మాట్లాడగలిగే స్వేచ్ఛ ఎప్పుడొస్తుందో’’ అని కమల్ అన్నాడు. ఐతే కొందరు మేధావుల్లాగా స్వేచ్ఛ అన్నది ఈ మధ్య కాలంలో మాత్రం తక్కువైపోయిందని మాట్లాడి వివాదంలో చిక్కుకోలేదు కమల్. ఇండియాలో ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.