Begin typing your search above and press return to search.
కాటమరాయుడు షోలెందుకు ఆగాయి?
By: Tupaki Desk | 24 March 2017 10:58 AM GMTమన రాష్ట్రం కాని తమిళనాడులో ‘కాటమరాయుడు’ ఫ్యాన్స్ షోలు తెల్లవారజామునే మొదలయ్యాయి. తమిళనాట పదుల సంఖ్యలో బెనిఫిట్ షోలు పడ్డాయి. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో సైతం ఇదే హంగామా కనిపించింది. బెంగళూరులో తెల్లవారుజామున బోలెడన్ని ఫ్యాన్స్ షోలు వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే చిన్న చిన్న టౌన్లలో సైతం బెనిఫిట్ షోల మోత మోగింది. కానీ తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మాత్రం అభిమానుల కోసం స్పెషల్ షోలు వేయలేదు. గత కొన్నేళ్లలో పవన్ ప్రతి సినిమాకూ భారీగా బెనిఫిట్ షోలు పడుతున్నాయి. కానీ ‘కాటమరాయుడు’కు మాత్రం ఒక్కటంటే ఒక్క షో కూడా వేయలేదు. రెండు మూడు రోజుల నుంచి ఇదిగో అదిగో అంటూ ఊరించి ఊరించి.. చివరికి ఉస్సూరుమనిపించారు.
బెనిఫిట్ షోల కోసం కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు.. అభిమాన సంఘాలు గట్టి ప్రయత్నం చేసినా.. పెద్ద స్థాయిలో రికమండేషన్లు చేయించినా ఫలితం లేకపోయింది. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఐతే బెనిఫిట్ షోల పేరుతో జరుగుతున్న దందాను ఆపడానికే పోలీసులు అంత కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలు వేస్తారు కానీ.. టికెట్ల రేట్లు మరీ ఎక్కువ ఉండవు. దాదాపుగా అన్ని చోట్లా 500కు అటు ఇటుగా రేట్లు పెడతారు. మరీ డిమాండ్ ఎక్కువుంటే బాల్కనీ టికెట్ గరిష్టంగా రూ.1000 పెట్టి అమ్ముతారు. కానీ హైదరాబాద్ లో అలా కాదు. టికెట్ రేటు మినిమం వెయ్యి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలకైతే రేట్లు మరీ దారుణంగా ఉంటాయి. రూ.2000-3000 పెట్టి అమ్మేస్తుంటారు టికెట్లు. నిన్న ‘కాటమరాయుడు’ సినిమాకు పర్మిషన్ వచ్చేసిందంటూ ఒక థియేటర్లో బెనిఫిట్ షో కన్ఫమ్ చేసి.. రూ.3000.. రూ.2000.. రూ.1000 చొప్పున రేట్లతో టికెట్లు అమ్మకానికి పెట్టారు. అభిమానుల అత్యుత్సాహాన్ని సొమ్ము చేసుకుని లక్షలు లక్షలు సంపాదించే పన్నాగమిది. పైగా ఛారిటీ అంటూ దీనికో ముసుగు తొడుగుతారు. పోలీస్ పర్మిషన్ కోసం రూ.3 వేలు ఇచ్చేసి బెనిఫిట్ షోల పేరుతో దందాలు నడిపిస్తాయి ఈ గ్యాంగులు. దీనిపై చాలా ఫిర్యాదులు రావడంతోనే హైదరాబాద్ పోలీసులు వీటికి అడ్డుకట్ట వేయాలని డిసైడయ్యారు. అందుకే కొంత కాలంగా పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు వేయనివ్వట్లేదు. ‘కాటమరాయుడు’ విషయంలో కొంచెం ఒత్తడి ఎక్కువున్నా సరే.. పోలీసులు వెనక్కి తగ్గలేదు. అభిమానులకు ఇది రుచించని విషయమే అయినా.. అది ఒక రకంగా వాళ్లకు మంచి చేసే విషయమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/