Begin typing your search above and press return to search.
కిక్ పరాజయం.. క్లారిటీ లేని ఫలితం
By: Tupaki Desk | 31 Aug 2015 1:40 PM GMTకిక్ -2 పరాజయం టాలీవుడ్ కి ఎన్నో పాఠాల్ని నేర్పిస్తోంది. ఇక్కడ అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి. కోట్ల రూపాయలు గంగలో కలిసిపోవడంతో భుజాలు తడుముకునే పరిస్థితి. అయితే ఈ ఎపిసోడ్ లో తప్పు ఎవరిది? ఎవరు ఎవరిని నిందించాలి? అంటే ఇందులో ముగ్గురుని కచ్ఛితంగా తప్పు పట్టాల్సిందే. హీరో రవితేజ, నిర్మాత కళ్యాణ్ రామ్ దర్శకుడు సురేందర్ రెడ్డిని నిందించడం తగునా? అన్న డిష్కసన్ ఫిలింనగర్ లో సాగుతోంది.
సెకండాఫ్ లో కోత కోయాల్సిందిగా సూచించినా మా మాట వినలేదు. అందుకే ఫెయిల్యూర్! అని హీరో, నిర్మాతలు చెబుతున్నారు కానీ, అసలు ఈ సినిమా ఆరంభం నుంచి ఆ ఇద్దరూ చేసిందేమిటి? కథలో ఎంత కిక్కుందో చూసుకున్న పాపాన పోలేదు. పైగా మాటల్లో అసలు విషయం ఉందా? లేదా? అన్నది ఆన్ సెట్స్ అయినా గ్రహించలేకపోయారా? ఇక బడ్జెట్ అదుపు తప్పే పరిస్థితి రాకముందే కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ విషయంలో ఎందుకు ఫెయిలైనట్టు? ఇన్నేళ్ల అనుభవంలో అతడు పాఠాలే నేర్వలేదా? 'పటాస్' అంత పకడ్భందీగా స్క్రిప్టు విషయంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయాడు?
డబ్బు ఉంది కదా! అని జల్లేయడమేనా? స్టార్ డైరెక్టర్ అయితే మాత్రం గుడ్డిగా నమ్మేయడమేనా? ఇలాంటి ప్రశ్నలు క్రిటిక్స్ మైండ్ లో ఉన్నాయి. వీటికి రవితేజ, కళ్యాణ్ రామ్ సమాధానం చెప్పాల్సిందే. ఇకపోతే సురేందర్ రెడ్డి కూడా ఇంత పేలవంగా ఎలా డిజైన్ చేశాడు అనే క్వశ్చన్ కూడా తలెత్తింది.