Begin typing your search above and press return to search.

ఆ హీరోపై సింగర్ ట్వీట్ల అసలు కథ బయటకు..

By:  Tupaki Desk   |   26 Feb 2017 5:09 PM GMT
ఆ హీరోపై సింగర్ ట్వీట్ల అసలు కథ బయటకు..
X
కొద్దిరోజులుగా తమిళ హీరో ధనుష్ పై.. ప్రఖ్యాత సింగర్ సుచిత్ర కార్తీక్ పోస్ట్ చేసిన వరుస ట్వీట్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ధనుష్ మీదా.. ఇషా ఫౌండేషన్ అధినపతి జగ్గీ వాసుదేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకిలా జరిగిందన్నది పెద్ద చర్చ సాగుతోంది. ఇలాంటి వేళ.. ఈ ఇష్యూ మీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సింగర్ సుచిత్ర భర్త కార్తీక్ కుమార్.

తన భార్య చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఆమెవి ఎంతమాత్రం కావంటూ తన ఫేస్ బుక్ పేజీ నుంచి చెప్పిన ఆయన.. తన భార్య ట్విట్టర్ పేజీ హ్యాకింగ్ కు గురైందని.. తాజాగా రిట్రీవ్ అయినట్లుగా పేర్కొన్నారు. శుభోదయం.. సుచి ట్విట్టర్ పేజీ హ్యాక్ కావటంతో కొద్ది రోజులుగా తాము కలత చెందుతున్నామని.. ఇలాంటి సమయాల్లో.. సంబంధిత వ్యక్తులు ఎంతటి మనోవ్యధకు గురి అయి ఉంటారో తాము అర్థం చేసుకొని ఉంటామని.. అందుకు తాను సారీ చెబుతున్నట్లుగా వెల్లడించారు.

ఈ ఇష్యూపై మీడియా ఎలాంటి సంచనాలకు పోకుండా ఉండాలని తానుకోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. భార్య అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని కార్తీ చెప్పిన దానిపై సింగర్ సుచిత్ర స్పందించలేదు. సోషల్ మీడియాలో ఇంత వివరణ ఇచ్చిన సుచిత్ర.. పనిలో పనిగా ధనుష్ కి పర్సనల్ గా ఫోన్ చేసి మరింత వివరణ ఇస్తే బాగుంటుందేమో..?