Begin typing your search above and press return to search.
గీత అలా మిస్ అయ్యిందా!!
By: Tupaki Desk | 9 Sep 2018 8:26 AM GMTప్రతి అన్నం మెతుకు మీద అది తినే వాడి పేరు రాసుంటుంది అన్నట్టు సినిమాల్లో పాత్రలు కూడా ఎవరి కోసం పుట్టి ఉంటాయో వాళ్లనే చేరుకుంటాయి అనిపిస్తుంది కొన్ని ఉదాహరణలు చూస్తే. గీత గోవిందం దెబ్బకు రష్మిక మందన్న రేంజ్ ఎక్కడికి వెళ్లిపోయిందో చూస్తున్నాం. దెబ్బకు తన పెళ్లిని కొంత కాలం వాయిదా వేసుకునే స్థాయిలో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. యాక్టింగ్ పరంగా మంచి స్కోప్ ఇవ్వడమే కాకుండా విజయ్ దేవరకొండతో సమానంగా జర్నీ చేసే పాత్ర కావడంతో ఇక్కడ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఛలోని మించిన సక్సెస్ రెండో సినిమాకే అందుకోవడంతో తన ఆనందం మాములుగా లేదు. నిజానికి ఈ పాత్రకు ముందు అనుకున్నది తీసుకున్నది లావణ్య త్రిపాఠిని. ఆ మేరకు కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్ లీక్ రూపంలో బయటికి వచ్చాయి కూడా. కానీ కారణాలు బయటికి తెలియనివ్వకుండా లావణ్య త్రిపాఠి అందులో నుంచి బయటికి రావడం కొంత గ్యాప్ తర్వాత రష్మిక మందన్న ఎంటర్ కావడం అన్ని చకచకా జరిగిపోయాయి.
లావణ్య త్రిపాఠిని ముందు తీసుకున్నప్పుడు తీసిన సీన్స్ లో తను చాలా హోమ్లీగా కనిపించడంతో పాటు ఇలాంటి పాత్రలు గతంలో చేసిన ఫీలింగ్ కలగడంతో అల్ట్రా మోడర్న్ టచ్ ఇవ్వమని పరుశురాంని అడిగిందట. కానీ ఫ్లేవర్ దెబ్బ తింటుందని భావించిన పరశురామ్ అందుకు ఒప్పుకోకపోవడంతో లావణ్య చివరికి తప్పుకుందట. ఏది జరిగినా మంచికే అన్నట్టు సినిమా చూసాక గీతగా రష్మిక మందన్న తప్ప ఇంకెవరిని ఊహించుకున్నా అంత సెట్ కారేమో అనిపించడం సహజం. పైగా లావణ్య త్రిపాఠి ఐదేళ్లకు పైగా సీనియారిటీ ఉన్న హీరోయిన్ కావడంతో అంత ఫ్రెష్ గా స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించకపోవచ్చు. సో గీత మారడం రష్మిక తలరాతనే మార్చేసింది. నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్ లో రష్మిక ఉండటం క్రేజ్ పరంగా మరో ప్లస్ తోడయ్యింది. అందుకే ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందన్న పెద్దల మాట నిజమే అనిపిస్తుంది.