Begin typing your search above and press return to search.

లేటుగా వచ్చినందుకే ప్రణీతకు పంచ్‌?

By:  Tupaki Desk   |   9 May 2016 9:29 AM GMT
లేటుగా వచ్చినందుకే ప్రణీతకు పంచ్‌?
X
మొన్న బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో మీరు ఒక విషయం గమనించే ఉంటారు. స్టేజీ మీద ఉన్న హీరోయిన్లు సమంత అండ్‌ కాజల్‌ అగర్వాల్‌ గురించి టాలెంటెడ్ హీరోయిన్లు అంటూ మహేష్‌ బాబు పొగిడేశాడు. చెప్పింది ఒక లైనే అయినా.. ఇద్దరితో తనకు గతంలో హిట్లు ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడు కూడా తన మరోసారి వారితో కలసి హిట్టే కొడతానని సెలవిచ్చాడు. బాగానే ఉంది.. మరి పక్కనే ఉన్న ప్రణీత గురించి చెప్పలేదేంటండీ?

నిజానికి చిన్న చిన్న డీటైల్స్‌ మహేష్‌ అంత త్వరగా మర్చిపోడట. కాకపోతే ఇక్కడ చాలా ఇరిటేటింగ్‌ థింగ్‌ ఏంటంటే.. 8 గంటలకు మహేష్‌ బాబు వచ్చాకనే.. హీరోయిన్లు వెన్యూకి విచ్చేశారు. అందరూ షార్పుగా 8 కే రావాలని చెప్పినా.. కాజల్‌ 10 నిమిషాలు ఆలస్యంగా రాగా.. సమంత ఓ 20 నిమిషాలు ఆలస్యం చేసింది. అయితే సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో తనతోపాటు సమంత షూటింగ్‌ లో పాల్గొంది కాబట్టి.. ఆమెను ఎక్సక్యూజ్‌ చేశారట. కాని ప్రణీత మాత్రం ఇంకా టైము తీసుకొని ఓ నలభై నిమిషాలు లేటుగా వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె గురించి మహేష్‌ బాబు మాట్లాడకుండా పెద్ద పంచ్‌ వేసేశాడు అనే సందేహం వస్తోంది.

ఒకప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఉదయాన్నే చెన్నయ్‌ లో షూటింగ్‌ చేసుకొని.. మధ్యాహ్నం ఊటీలో పాట షూటింగ్‌ కు వెళ్లి.. నైట్‌ షిఫ్టుకు వేరే ఫ్లయిట్‌ లో హైదరాబాద్‌ వచ్చి.. ఒకే రోజు మూడు ప్లేసుల్లో మూడు సినిమాలకు షూటింగ్‌ చేసేవారట. అంటే ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన మహేష్‌ కు మరి టైమ్‌ మేనేజ్ మెంట్‌ అనేది ఎలా ఉంటుందో చూడండి. పాపం ప్రణీత!!