Begin typing your search above and press return to search.
మాళవిక ప్రమోషన్ కు ఎందుకు రావడం లేదంటే
By: Tupaki Desk | 2 March 2016 4:21 AM GMTచాలా మంది తారలు సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే ప్రచారం వుంది. అందులో మొదటి వరుసలో నయనతార ఉంటుంది. ఈ అమ్మడు మూవీ ప్రమోషన్స్ కు చాలా దూరంగా వుంటుంది. ఆ విషయాన్ని నిర్మాతలకు ముందుగానే చెప్పేస్తుందట ఈ మలయాళ కుట్టి. అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం బిజీ షెడ్యూల్స్, ఇతర కమిట్ మెంట్స్ వల్ల కొన్ని సార్లు రాలేకపోతున్నారు. తాజాగా మాళవిక నాయర్ పరిస్థితి కూడా ఇంతే. నందిని రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్యతో కలిసి ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నటించింది ఈ కేరళ కుట్టి. ఈ సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడుతోంది. ఓ వైపు చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ఓ రేంజ్ లో చేసేస్తున్నారు. వరుసబెట్టి దర్శకురాలు, హీరో ఇంటర్య్వూలు ఇచ్చేస్తున్నారు. అయితే వీరి ఇంటర్వూలలో రీడర్స్ కి కిక్ ఏముంటది. అదే హీరోయిన్ ఇంటర్వ్యూలైతే కాస్త స్పైజీగా రీడబుల్ గా వుంటాయి. కానీ ఈ అమ్మడు మూవీ ప్రమోషన్స్ కు ఎందుకు రావడం లేదనేది హీరో నాగ శౌర్య క్లారిటీ ఇచ్చాడు.
మళవిక నాయర్ ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ సీబీఎస్ సిలబస్ లో రాస్తోందట. దాంతో మూవీ ప్రమోషన్స్ కు రావడం కుదరడం లేదని హీరో నాగ శౌర్య తెలిపారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగశౌర్య.. మాళవిక గురించి ఈ విషయాన్ని వెల్లడించారు. తాను సెట్స్ లో చాలా కామ్ గా వుంటుందని, చిన్న పిల్ల మనస్తత్వం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఇంటర్ పరీక్షలు రాస్తుండటం వల్లే ప్రమోషన్స్ కి రాలేకపోతోందని చెప్పుకొచ్చారు. అలాగే ఇందులో తన మమ్మిగా నటించిన ఐశ్వర్య గురించి కూడా మాట్లాడుతూ ‘నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం.. అలాగే ఐశ్వర్య గారు కూడా డాగ్ లవర్. చాలా కేరింగ్ తీసుకుంటారు. మేమిద్దరం డాగ్ లవర్స్ కావడం వల్ల వాటి కేరింగ్ గురించి చాలా విషయాలు సెట్స్ లో మాట్లాడుకునే వాళ్లం. అవసరమైతే డాగ్స్ కేరింగ్ విషయంలో ప్రచారం చేయడానికైనా రెడీ’ అన్నాడు.