Begin typing your search above and press return to search.

కృష్ణ 'ముగ్గురు కొడుకులు' వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 10:53 AM GMT
కృష్ణ ముగ్గురు కొడుకులు వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
X
కృష్ణ తన నట వారసులను ముందుగానే ప్రేక్షకులకు పరిచయం చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ ని.. సోలో హీరోగా రమేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేశారు. కృష్ణ తన ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేష్ లతో కలిసి చేసిన సినిమా ముగ్గురు కొడుకులు. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ తన తల్లి నాగ రత్నమ్మ కోరిక మేరకు చేశారట. కృష్ణ, హనుమంతరాఫు, ఆది శేషగిరిరావు ముగ్గురు కొడుకులు ఉన్న నాగరత్నమ్మ వారి ప్రతీకగా ఓ సినిమా చేయమని చెప్పారట.

అమ్మ చెప్పిందని ముగ్గురు కొడుకులు అంటూ ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు కృష్ణ. కథ రెడీ కాకుండానే టైటిల్ రిజిస్టర్ చేయించినా కథ కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చిందట. మహారథికి ముగ్గురు కొడుకుల కథ రెడీ చేయమని చెప్పగా ఆయన లేట్ చేస్తుండటంతో పరుచూరి బ్రదర్స్ కి ఆ పని అప్పచెప్పారట కృష్ణ.

వారు ఒక కథ రెడీ చేయగా నాగ రత్నమ్మకి ఆ కథ నచ్చలేదట. ఇక అప్పుడు పీసీ రెడ్డి ఓ లైన్ చెప్పగా.. అది నచ్చి పరుచూరి బ్రదర్స్ కి దాన్ని డెవలప్ చేయమని చెప్పారట. పరుచూరి బ్రదర్స్ దానికి మాటలు అందించారు.

కృష్ణ, రమేష్ బాబు, మహేష్ నటించిన ముగ్గురు కొడుకులు మూవీని సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అమ్మ కోసం తీసిన ముగ్గురు కొడుకులు 1988లో రిలీజై సక్సెస్ అయ్యింది.

ఆ సినిమా 100 రోజుల వేడుక టైం కి నాగరత్నమ్మ కాలం చేశారు. అమ్మ కోరిక తీర్చి కృష్ణ ఆమెకు సంతృప్తిని ఇచ్చారు. ఇదే కాదు మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినవన్ని కృష్ణ సినిమాలే అవడం విశేషం. మహేష్ కి చిన్నప్పటి నుంచే నట మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగేలా చేసిన కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యాక స్టడీస్ కోసం కొంత గ్యాప్ ఇప్పించి ఫైనల్ గా రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు.

సినిమా విషయంలో ఎలాంటి రిస్క్ అయినా చేసే కృష్ణ స్పూర్తితో మహేష్ తన ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు కృష్ణ తీసిన సినిమాల తరహాలోనే ఇప్పుడు మహేష్ సినిమాలు కూడా ఎంతోకొంత సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయి. మహేష్ హీరోగా మారిన తర్వాత కృష్ణ కూడా ఆయన సినిమాల్లో కనిపించారు. అయితే ఇద్దరు కలిసి చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవలేదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.