Begin typing your search above and press return to search.
చైతూ పెళ్లి గాసిప్ అలా పుట్టింది
By: Tupaki Desk | 19 Nov 2015 9:30 AM GMTనిన్నటివరకూ అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం అఖిల్ గురించిన ఆసక్తికర డిస్కషన్ సాగింది. సినిమా బాలేకపోయినా అఖిల్ నటన, డ్యాన్సులు బావున్నాయంటూ ప్రశంసలొచ్చాయి. అయితే ఇప్పుడు అఖిల్ గోవాలో ఫ్రెండ్సుతో చిలౌట్ అవుతున్నాడు. అందుకే టాపిక్ నాగచైతన్య వైపు డైవర్ట్ అయ్యింఇ. అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రేమమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కథానాయికలు, ఇతర కీలక నటీనటుల ఎంపిక జరుగుతోంది. డిసెంబర్ లో వైజాగ్ లో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. అయితే ఈలోగానే నాగచైతన్యపై రకరకాల వార్తలు శికార్లు చేస్తున్నాయి. ఇంతకీ అవన్నీ ఎలా పుట్టాయ్?
చైతన్య రొమాంటిక్ హీరోగానే కాదు .. రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ లతో రొమాన్స్ చేయడంలో స్పీడ్ గానే ఉంటాడు.. అందుకే ఒక హీరోయిన్ ను పెళ్ళాడబోతున్నాడు అనే ప్రచారం సాగుతోందిప్పుడు. అయితే అసలు ఈ గాసిప్ పుట్టడానికి కారణం ఏంటి?? అబ్బే ఏం లేదు.. మొన్న ఒక రోజున ఓ ఫిలిం నగర్ కాఫీ షాఫ్ లో ఓ కథానాయికతో కనిపించాడు కుర్రాడు. వారు సరదాగా కాఫీ తాగడానికే వచ్చుంటారు.. కాని అది చూసిన ఔత్సాహికులు మాత్రం.. మనోడు ఆమెతో డేటింగ్ చేసుకుంటున్నాడు, పెళ్ళాడబోతున్నాడు అంటూ వార్తలొచ్చాయి. ఈ నెల 23న పుట్టినరోజు వేళ పెళ్లి మ్యాటర్ ని ప్రకటించబోతున్నాడు అంటూ ప్రచారం సాగింది. ఏదేమైనా.. ఇలా పక్కనే కాఫీ తాగుతూ కనిపిస్తే పెళ్ళి అనేస్తారా? అలా అంటే మన కుర్ర హీరోల్లో ఒక్కొక్కరికీ ఈపాటికి ఓ డజను పెళ్ళిలయ్యేవి.