Begin typing your search above and press return to search.
చైతూ అందుకే వద్దన్నాడా?
By: Tupaki Desk | 5 May 2016 7:30 AM GMTఅన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. ‘అ..ఆ’ సినిమా ట్రైలర్లో వినిపించిన ‘‘నిన్ను.. ప్రేమించేంత లగ్జరీ లేదు. వదిలేసేంత లెవెలూ లేదు’’ అనే డైలాగ్ నితిన్ కాకుండా నాగచైతన్య చెప్పాల్సింది. కానీ అలా జరగలేదు. ‘అ..ఆ’ కథకు త్రివిక్రమ్ ముందు అనుకున్న హీరో నాగచైతన్యనే. కానీ అతను ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు అడిగితే చైతూ కాదనడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. దీనికి కారణం ఏంటన్నది మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. ఐతే ‘అ..ఆ’ కథ దాదాపు లేడీ ఓరియెంటెడ్ తరహాలో ఉండటం.. హీరో పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే చైతూ ఆ సినిమా వదులుకున్నాడని ఇప్పుడు అర్థమవుతోంది.
‘అ..ఆ’ టీజర్ కానీ.. ట్రైలర్ కానీ చూస్తే సమంత పాత్రకే చాలా ప్రాధాన్యం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. సమంత పాత్ర చుట్టూనే కథ నడుస్తుందని.. ఆమెనే సినిమాలో ఎలివేట్ అవుతుందని యూనిట్ సభ్యులు కూడా చెబుతున్నారు. ఆడియో వేడుకలో.. ‘‘ఇది హీరో కథా.. హీరోయిన్ కథా.. అని ఆలోచించకుండా కథను నమ్మి సినిమా చేసిన నితిన్ కు థ్యాంక్స్’’ అని త్రివిక్రమ్ చెప్పడం గుర్తుండే ఉంటుంది. దీన్ని బట్టి కూడా ఇది హీరోయిన్ ప్రాధాన్యమున్న కథ అని అర్థమైపోతుంది. చైతూకు అసలే మాస్ ఇమేజ్ లేదు. పైగా హీరోయిన్ కు ప్రాధాన్యమున్న కథ చేస్తే మరింతగా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. అందుకే అతను ఈ సినిమాను నో చెప్పి ‘ప్రేమమ్’ మీద దృష్టిపెట్టాడని అర్థమవుతోంది.