Begin typing your search above and press return to search.

మెగా పెయింటింగ్స్ కథేమిటో ?

By:  Tupaki Desk   |   4 Sep 2019 8:58 AM GMT
మెగా పెయింటింగ్స్ కథేమిటో ?
X
సెలెబ్రిటీలు అందులోనూ మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలు ఏం చేసినా అదో పెద్ద న్యూస్ అవుతుంది. ఇది కూడా అలాంటిదే. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఇటీవలే నాగబాబు వరుణ్ తేజ్ ఫారిన్ ట్రిప్ వేశారు. అందులో భాగంగా హాంగ్ కాంగ్ - మకావు లాంటి ప్రదేశాలకు వెళ్లారు. ఆర్ట్ పెయింటింగ్స్ కు సుప్రసిద్ధి చెందిన హాంగ్ కాంగ్ లో సుమారు కోటి రూపాయల విలువైన వర్క్స్ ని వరుణ్ తేజ్ స్వయంగా ఎంపిక చేసి కొన్నాడట. సౌత్ ఆసియాకు చెందిన ప్రముఖ పెయింటర్స్ వేసిన ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంటుంది.

ఒకవేళ భవిష్యత్తులో అమ్మాలి అనుకున్నా పెట్టిన ధరకు కనీసం రెట్టింపు ఈజీగా వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే కొన్ని కంపెనీలు వీటి మీదే బిజినెస్ చేస్తూ మంచి లాభాలు కళ్లజూస్తున్నాయి కూడా. మరి వరుణ్ తేజ్ నాగబాబులు అలాంటి ఫ్యూచర్ ప్లాన్ తో ఏమైనా కొన్నారా లేక తమ ఇళ్ల ఇంటీరియర్ డెకొరేషన్ కోసం కొనుగోలు చేశారా అనే క్లారిటీ మాత్రం లేదు. మెగా ఫ్రెండ్స్ మాత్రం ఇది వాళ్ళ పర్సనల్ పర్చేజ్ అని చెబుతున్నారు.

ఒకవేళ స్వంత టేస్ట్ మీదే కొన్నారు అనుకున్నా కేవలం పెయింటింగ్ కోసమే కోటి రూపాయల ఖర్చు అవసరమా అనే సందేహం రాకమానదు. అదలా ఉంచితే వాల్మీకి సెప్టెంబర్ 20 రిలీజ్ కు ముస్తాబవుతోంది. ముందు 13నే అనుకున్నప్పటికీ గ్యాంగ్ లీడర్ తో క్లాష్ వద్దనుకుని వారం వాయిదా వేసుకున్నారు. మొదటిసారి ఊర మాస్ గెటప్ ట్రై చేసిన వరుణ్ వాల్మీకి మీద చాలా నమ్మకంతో ఉన్నాడు