Begin typing your search above and press return to search.
నాగ్ ఎందుకు తగ్గట్లేదంటే
By: Tupaki Desk | 22 Dec 2015 5:30 PM GMTసోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని సంక్రాంతి కి రిలీజ్ చేయబోతున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించినప్పటి నుంచి చాలామందిలో ఓ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ రేస్ లోకి ఎంట్రీ లేట్ గా ఇచ్చినా సరే, రిలీజ్ విషయంలో అసలు కాంప్రమైంజ్ కావడం లేదు నాగ్. బాలకృష్ణ డిక్టేటర్ - ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రాలు ఉన్నా సరే.. పండక్కి సోగ్గాడు ప్రేక్షకుల ముందు రావడం పక్కా అని తేల్చేశాడు.
ఒకవేళ యంగ్ టైగర్ తన సినిమాని వాయిదా వేసుకున్నా సరే.. బాలయ్యకి ఎదురువెళ్లడం రిస్కీ వ్యవహారమే. ఇలా సీనియర్ హీరోలు ఒకేసారి వచ్చి పోటీ పడే సంస్కృతి ఏళ్ల క్రితమే కనిపించడం మానేసింది. నాగ్ ఇంతగా పట్టు పట్టడానికి ఆయన దగ్గర దీనికి సరైన కారణమే ఉందిట. డిక్టేటర్, నాన్నకు ప్రేమతో చిత్రాలు పక్కా మాస్ ఎంటర్ టెయినర్లు. హీరోలే కాదు, డైరెక్టర్లకు కూడా మాస్ లోనే ఇమేజ్ ఎక్కువగా ఉంది. మరి నాగ్ రిలీజ్ చేయనున్నదేమో ఫ్యామిలీ ఎంటర్ టెయినర్. అంటే వాటితో తనకు పోటీ లేదనే ఫీలింగ్ నాగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబం మొత్తం చూడదగ్గ ఇలాంటి సినిమాలకు పండుగ సీజన్ లకు మించిన పర్ఫెక్ట్ సందర్భం ఉందన్నదని నాగ్ ఉద్దేశ్యం.
మరోవైపు మీలో ఎవరు కోటీశ్వరుడు రియాల్టీ షో తర్వాత నాగ్ కు ఫ్యామిలీలలో కూడా క్రేజ్ బాగానే పెరిగింది. ఇది సినిమా హిట్ కు హెల్ప్ అవుతుందని నాగ్ అశిస్తున్నాడు. అంతే కాదు.. మనం తర్వాత నాగ్ నుంచి ఓ ఫ్యామిలీ మూవీ వస్తోందంటే.. ఖచ్చితంగా ఆసక్తి కలిగించే విషయమే. ఇన్ని రీజన్స్ ఉండడంతోనే.. సంక్రాంతికి తన సోగ్గాడే చిన్ని నాయన వచ్చినా .. పెద్దగా నష్టం ఉండదని భావిస్తున్నాడట నాగార్జున.